కరోనాతో కొట్టుకుంటున్న కొత్త జంటలు.. భారీగా విడాకుల కేసులు

Coronavirus Effect: ఇట్స్ కరోనా టైం.. ప్రపంచదేశాలన్నీ కూడా ఈ మహమ్మారి కారణంగా అన్నింటికీ సెలవులు ప్రకటించాయి. ఇక ఈ తరుణంలో కొత్తగా పెళ్ళైన జంటలకు కరోనా విలన్‌గా మారింది. అదేంటి కరోనా వైరస్‌‌కు, వాళ్లకు లింకేంటి అని అనుకుంటున్నారా.? అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మహమ్మారి కరోనా వైరస్ చైనాలోని కొత్తగా పెళ్ళైన జంటలకు విలన్‌గా మారింది. వాళ్ల కాపురాల్లో చిచ్చుపెడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24 […]

కరోనాతో కొట్టుకుంటున్న కొత్త జంటలు.. భారీగా విడాకుల కేసులు
Follow us

|

Updated on: Mar 16, 2020 | 2:14 PM

Coronavirus Effect: ఇట్స్ కరోనా టైం.. ప్రపంచదేశాలన్నీ కూడా ఈ మహమ్మారి కారణంగా అన్నింటికీ సెలవులు ప్రకటించాయి. ఇక ఈ తరుణంలో కొత్తగా పెళ్ళైన జంటలకు కరోనా విలన్‌గా మారింది. అదేంటి కరోనా వైరస్‌‌కు, వాళ్లకు లింకేంటి అని అనుకుంటున్నారా.? అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహమ్మారి కరోనా వైరస్ చైనాలోని కొత్తగా పెళ్ళైన జంటలకు విలన్‌గా మారింది. వాళ్ల కాపురాల్లో చిచ్చుపెడుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి చూసుకుంటే అక్కడ ఒకే ఆఫీసులో పని చేస్తున్న 300 జంటలు విడాకులకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా అన్ని దేశాలూ హై-అలెర్ట్ పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్కూళ్లు, విద్యాసంస్థలు, ఆఫీసులు.. ఇలా ఒకటేమిటి అన్నింటినీ బంద్ చేసి జనాలను గృహ నిర్బంధం చేశారు. దీనితో కొత్తగా పెళ్ళైన జంటలు ఇళ్ల దగ్గర ఎక్కువగా సమయం గడుపుతున్నారు. అలాగే ఏదొక సందర్భంలో గొడవలకు దిగుతున్నారు.

ఈ నేపథ్యంలోనే వందలాది జంటలు తమ బంధానికి ఫుల్‌స్టాప్ చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది అపాయింట్‌మెంట్లను సైతం తీసుకున్నట్లు డజహౌకు చెందిన మ్యారేజ్ రెజిస్టరీ మేనేజర్ లూ షిజున్ స్పష్టం చేశాడు.

మునపటి కంటే విడాకులు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. యువ జంటలు ఎక్కువసేపు ఇళ్ల దగ్గర గడుపుతున్న నేపథ్యంలో ఇరువురి మధ్య గొడవలు జరగడం, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం వల్లే వాళ్ల వ్యవహారం విడాకుల వరకు వెళ్తోందని ఆయన అన్నారు.

అయితే విడాకులు తీసుకోవడానికి ఇదొక్క కారణమే కాకపోవచ్చునని.. సంస్థలు కొద్దిరోజులుగా మూసేసి ఉండటంతో అప్లికేషన్స్ వెల్లువ పెరిగి ఉండవచ్చునని లూ షిజున్ అభిప్రాయపడుతున్నారు. ఒక్క డజహౌ నగరంలోనే కాదు.. చైనాలోని పలు క్యాపిటల్ సిటీస్‌లో విడాకుల కేసులు ఎక్కువైనట్లు తెలుస్తోంది.

కాగా, చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం 156 దేశాలకు విస్తరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 6000 మంది ప్రాణాలు కోల్పోయారు.

For More News:

ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..

ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?

రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!

ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..

Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..

కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..