భక్తులకు మనవి.. 28 రోజుల వరకు తిరుమలకు రావొద్దు..

కరోనా వైరస్‌ ప్రభావం దేవుళ్లపై కూడా పడింది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రముఖ క్షేత్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ క్రమంలోనే...

భక్తులకు మనవి.. 28 రోజుల వరకు తిరుమలకు రావొద్దు..
Jyothi Gadda

|

Mar 16, 2020 | 1:15 PM

కరోనా వైరస్‌ ప్రభావం దేవుళ్లపై కూడా పడింది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రముఖ క్షేత్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన అనంతరం 28 రోజుల వరకు తిరుమలకు రాకూడదని తిరుమల తిరుపతి దేవస్థాయం విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడా గుంపులు గుంపులుగా చేరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 17నుంచి టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం తిరుపతి, తిరుమలలో ప్రత్యేక కౌంటర్లను అందుబాటులోకి తేనుంది టీటీడీ.

తిరుపలకు వచ్చిన భక్తులకు ముందుగానే అలిపిరి, శ్రీవారి మెట్టు, టోల్ గేట్ వద్ద భక్తులకు వైద్యపరిక్షలు నిర్వహిస్తున్నారు. అస్వస్థతకి గురైన భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకుని వారి టికెట్టును dyeotemple@gmail.comకి మెయిల్ చేస్తే మరో రోజు దైవదర్శనం ఏర్పాటు చేసుకోవడానికి లేదా నగదు తిరిగి పొందడానికి వీలుంటుందని దీనికి భక్తులు వైరస్ వ్యాపించకుండా సహకరించాలని ప్రార్థించారు. చర్యల్లో భాగంగా రేపటి నుండి(మంగళవారం ఈనెల 17నుండి )భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని గదులలో వేచి ఉండే వీలు లేదు. టైమ్ స్లాట్ ప్రకారం వారు పొందిన టైమ్ కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి అనుమతిస్తారు. 17వ తేదీన దివ్యాంగులకు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం కలదు. ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 2గంటలకు, 3 గంటలకు అనుమతిస్తారు. 18వ తేదీన ఐదు, ఐదు ఏళ్లలోపు వయసున్న చిన్నపిల్లల తల్లీతండ్రులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఉదయం 9గంటలకు, మధ్యాహ్నం 1.30గంటకు అనుమతిస్తారు.

మరోవైపు వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక పూజాదికార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేలా ఆశీర్వదించాలని కోరుతూ ఈనెల 19న తిరుమల పర్వేటి మండపం వద్ద శ్రీనివాస శాంత్యోత్సవ ధన్వంతరి మహాయాగం నిర్వహిస్తోంది. మూడ్రోజుల పాటు ఈ మహాయాగం కొనసాగనుంది. ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది టీటీడీ. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతోంది. కరోనా భయంతో సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, విశేషపూజల సేవలను టీటీడీ రద్దు చేసింది. కరోనా నేపధ్యంలో నేటి నుంచి జపయజ్ఞం చేయనుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu