హైదరాబాద్‌లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు.. తాజా లిస్టు ఇదే.!

జూలై 30 నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో 92 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. బుధవారం నాటికి 65 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి.

హైదరాబాద్‌లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు.. తాజా లిస్టు ఇదే.!
Follow us

|

Updated on: Aug 13, 2020 | 1:25 AM

Hyderabad Containment Zones: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గ్రేటర్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. గత నాలుగు రోజులుగా 500 కంటే తక్కువ కేసులు నమోదవుతుండటం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గుతుండటంతో.. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గుతోంది.

జూలై 30 నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో 92 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. బుధవారం నాటికి 65 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రెండు వారాల క్రితం ఎల్బీ నగర్‌లో ఐదు కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ఆ సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరింది.

గతంలో చార్మినార్ పరిధిలో అత్యధికంగా 31 కంటైన్మెంట్ జోన్లు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 15 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి. అటు ఖైరతాబాద్‌లో రెండు వారాల క్రితం 14 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ప్రస్తుతం 21కి పెరిగాయి. సికింద్రాబాద్ పరిధి‌లో అయితే ప్రస్తుతం ఐదు కంటైన్మెంట్ జోన్లు.. శేరిలింగంపల్లి జోన్‌లో 10 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కాగా, గతంలో కూకట్‌పల్లి పరిధి‌లో 9 కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. ప్రస్తుతం 8 కంటైన్మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయి.

Also Read: ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మరోసారి వాయిదా..!

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..