దేశంలో కరోనా.. 24 గంటల్లో 56,282 కేసులు, 904 మరణాలు..

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 56,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా

దేశంలో కరోనా.. 24 గంటల్లో 56,282 కేసులు, 904 మరణాలు..
Follow us

|

Updated on: Aug 06, 2020 | 10:58 AM

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 56,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 904 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,537కి చేరుకుంది. ఇందులో 5,95,501 యాక్టివ్ కేసులు ఉండగా.. 40,699 మంది కరోనాతో మరణించారు. అటు 13,28,337 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో వరుసగా ఎనిమిదో రోజు 50,000 పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఎక్కువగా మహారాష్ట్ర, న్యూఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే రోజూ 5 వేలు పైచిలుక కేసులు నమోదవుతున్నాయి. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. అటు కోవిడ్ మరణాలు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించాయి. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్ 67.62 శాతంలో ఉండగా.. డెత్ రేట్ 2.07 శాతంలో ఉంది.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!