జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం, సర్పంచ్ కాల్చివేత

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో బీజేపీకి చెందిన సర్పంచ్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని సజ్జాద్ అహ్మద్ ఖాండేగా గుర్తించారు. ఆయనను ఇంటిబయటే హతమార్చినట్టు తెలుస్తోంది.

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం,  సర్పంచ్ కాల్చివేత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 06, 2020 | 11:37 AM

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో బీజేపీకి చెందిన సర్పంచ్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని సజ్జాద్ అహ్మద్ ఖాండేగా గుర్తించారు. ఆయనను ఇంటిబయటే హతమార్చినట్టు తెలుస్తోంది. బుల్లెట్ గాయాలకు గురైన సజ్జాద్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఏ ఉగ్రవాద బృందం కూడా ఇందుకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ప్రకటించలేదు. సెక్యూరిటీతో కూడిన ఓ  క్యాంప్ లో ఇతర సర్పంచులతో కూడి ఉంటూ వచ్చిన సజ్జాద్.. తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరి ఇల్లు చేరబోతుండగా మాటు వేసిన టెర్రరిస్టులు కాల్చి చంపారు. నిన్న ఆరిఫ్ అహ్మద్ అనే సర్పంచ్ పై కూడా హత్యాయత్నం జరిగింది.