దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!

నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10-12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!

నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10-12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి, 57.62 లక్షల మంది రైతులకు, రూ.7,251 కోట్ల రూపాయలు అందించడం అసాధారణమని పేర్కొన్నారు. గత వానాకాలంలో రాష్ట్రంలో కోటి 22 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, ఈ సారి కోటి 30 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతున్నదని వారు వివరించారు. తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం, పంటల దిగుబడి పెరగడం పట్ల కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది.

Also Read: తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

Published On - 10:58 am, Thu, 6 August 20

Click on your DTH Provider to Add TV9 Telugu