ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,526 పాజిటివ్ కేసులు, 81 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,721కి చేరింది.
Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,526 పాజిటివ్ కేసులు, 81 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,721కి చేరింది. ఇందులో 96,191 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,00,816 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3714కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,463 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)
ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 35,41,321 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 833, చిత్తూరులో 819, తూర్పు గోదావరిలో 1178, గుంటూరులో 801, కడపలో 501, కృష్ణాలో 414, కర్నూలులో 757, నెల్లూరులో 1151, ప్రకాశంలో 874, శ్రీకాకుళంలో 764, విశాఖలో 896, విజయనగరంలో 552, పశ్చిమ గోదావరిలో 986 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 28/08/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,00,721 పాజిటివ్ కేసు లకు గాను *3,00,816 మంది డిశ్చార్జ్ కాగా *3,714 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,191#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/taKk5r8lNS
— ArogyaAndhra (@ArogyaAndhra) August 28, 2020