AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

Coronavirus Effect: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. ప్రజలను భయపెట్టేందుకు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే తిరుమల శ్రీవారి సన్నిధిలోని అఖండ దీపం అరిపోయిందని ప్రచారం సాగింది. దీనిపై తాజాగా టీటీడీ అగమశాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు స్పందించారు. సోషల్ మీడియాలో అఖండ దీపంపై వచ్చే వదంతులను నమ్మొద్దని.. అవన్నీ అవాస్తవాలేనని ఆయన వెల్లడించారు. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. […]

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
Ravi Kiran
|

Updated on: Mar 28, 2020 | 2:24 PM

Share

Coronavirus Effect: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. ప్రజలను భయపెట్టేందుకు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే తిరుమల శ్రీవారి సన్నిధిలోని అఖండ దీపం అరిపోయిందని ప్రచారం సాగింది. దీనిపై తాజాగా టీటీడీ అగమశాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు స్పందించారు.

సోషల్ మీడియాలో అఖండ దీపంపై వచ్చే వదంతులను నమ్మొద్దని.. అవన్నీ అవాస్తవాలేనని ఆయన వెల్లడించారు. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తిరుమలకు భక్తులు రాకుండా రహదారులను మూసివేశామన్నారు.

మరోవైపు గర్భాలయంలో రెండు అఖండ దీపాలున్నాయని చెప్పిన ఆయన.. అవి బయట నుంచి భక్తులకు కనిపించవని తెలిపారు. గర్భాలయంలోని రెండు మూలల్లోనూ రెండు నిలువెత్తు వెండి దీపాలు.. అలాగే స్వామివారికి ఇరువైపులా రెండు నందా దీపాలు వేలాడుతూ ఉంటాయన్నారు. వీటిని ఉదయం సుప్రభాతంలో అర్చకులు వెలిగిస్తారని.. ఇక రాత్రి ఏకాంత సేవలో స్వామివారు వేంచేసినప్పుడు ఈ దీపాలను ఆర్పివేస్తారని.. మళ్ళీ తిరిగి మరుసటి రోజు ఉదయం సుప్రభాతం వేళ వెలిగిస్తారన్నారు.

అటు శ్రీవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో వద్ద అఖిలాండం అనే దీపారాధన ఉంది. ఇక్కడ భక్తులు కర్పూరం వెలిగించి.. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఇక ఇప్పుడు భక్తులు లేకపోవడంతో అఖిలాండం వద్ద కర్పూర దీపం ఆరిపోయింది. ఇది అసలు వాస్తవం..

అఖిలాండం ఆరిపోవడం వల్ల ఎలాంటి అపచారం జరగదు.. అంతేకాక వైపరీత్యం కూడా సంభవించదు. ప్రజలను భయపెట్టడానికి ఎవరో కొంతమంది ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారు. వాటిని భక్తులు నమ్మొద్దని రమణ దీక్షితులు అన్నారు.

For More News:

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?