కరోనాతో వణుకుతున్న అగ్రరాజ్యం.. న్యూయార్క్ మరో వుహాన్ కానుందా..!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే సుమారుగా కొత్త కేసులు 10 వేలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 55 వేలకు చేరుకోగా.. 784 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. నిన్న 150 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనాతో వణుకుతున్న అగ్రరాజ్యం.. న్యూయార్క్ మరో వుహాన్ కానుందా..!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2020 | 2:46 PM

Coronavirus: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే సుమారుగా కొత్త కేసులు 10 వేలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 55 వేలకు చేరుకోగా.. 784 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. నిన్న 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ తీవ్రతరం ఉన్నా న్యూయార్క్ రాష్ట్రంలో అయితే మంగళవారం ఏకంగా 53 మంది మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ మృతిచెందిన వారి సంఖ్య 201కి చేరింది. అటు బాధితుల సంఖ్య 25వేలకు పెరిగింది. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్‌, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడాలోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ తొలుత విజృంభించిన వాషింగ్టన్‌లో మాత్రం నిన్న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 12 నాటికి పరిస్థితులు అన్ని కూడా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం అమెరికాలో లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలు ఒకే చోట గుమ్ముగూడవద్దని, సామాజిక దూరం పాటించాలని, అలాగే చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని అధికారులు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 3,70,000 మందికి పరీక్షలు నిర్వహించామని కరోనా వైరస్ కట్టడికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యదళం అధికారి తెలిపారు. అయితే ఇంకా పరీక్షల చేయాల్సిన కేసులు ఎక్కువగా ఉండటంతో వైరస్ సోకిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

For More News:

ఏపీలో మరో కరోనా కేసు…

కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..

ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?

‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..

దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..

కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..

జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..

ఈ లక్షణాలు ఉన్నా.. కరోనా వైరస్ సోకినట్లే..!

గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!