Coronavirus Cases In AP: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 478 పాజిటివ్ కేసులు.. 3 మరణాలు..
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 478 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,76,814కి చేరింది.
Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 478 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,76,814కి చేరింది. ఇందులో 4,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,65,327 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 7,067కు చేరుకుంది. ఇక నిన్న 715 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,10,01,476 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 30, చిత్తూరు 89, తూర్పుగోదావరి 58, గుంటూరు 48, కడప 19, కృష్ణా 62, కర్నూలు 6, నెల్లూరు 17, ప్రకాశం 12, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 44, విజయనగరం 17, పశ్చిమ గోదావరి 63 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.