ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,601 పాజిటివ్ కేసులు, 86 మరణాలు సంభవించాయి.

Coronavirus Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,601 పాజిటివ్ కేసులు, 86 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. ఇందులో 89,516 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,68,828మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..
అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,368కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 8,741 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1441 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 50 వేలు దాటింది. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 32,92,501 టెస్టులు నిర్వహించారు.
Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..
#COVIDUpdates: 24/08/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,58,817 పాజిటివ్ కేసు లకు గాను *2,65,933 మంది డిశ్చార్జ్ కాగా *3,368 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 89,516#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/e6LRVOjn4P
— ArogyaAndhra (@ArogyaAndhra) August 24, 2020




