కరోనా దెబ్బ.. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. గురించి తెలిసిందే. దీని ప్రభావంతో మనదేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డ విషయం తెలిసిందే. ఇక ఇతర దేశాల గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇటలీ, యూకే ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రిటన్‌లో ఇప్పటికే 798 కరోనా కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మే 7న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకే ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:14 pm, Sat, 14 March 20
కరోనా దెబ్బ.. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. గురించి తెలిసిందే. దీని ప్రభావంతో మనదేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, మాల్స్, సినిమా హాళ్లు మూతపడ్డ విషయం తెలిసిందే. ఇక ఇతర దేశాల గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇటలీ, యూకే ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. బ్రిటన్‌లో ఇప్పటికే 798 కరోనా కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మే 7న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుముఖత చూపరన్న కారణంతోనే ఎన్నికల అధికారులు భావించి.. వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో వచ్చే ఏడాది వరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా.. ఈ వారంలో కేవలం 24 గంటల్లోనే 208 కరోనా కేసులు నమోదవ్వడంతో.. బ్రిటన్‌లో కలకలం రేగింది.