“ఏంది కరోనానా..గ్లాసు గోమూత్రంతో పరార్..”

‘ఏంది కరోనా వచ్చిందా?’…నో వర్రీస్ …గ్లాసు గోమాత్రం తాగితే అదే పరారవుతుంది అంటున్నారు..అఖిల భారత హిందూ మహాసభల అధ్యక్షుడు చక్రపాణి మహరాజ్ స్వామిజీ. ఇందుకు ఆయన గోమూత్రం పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి వచ్చినవారంతా గ్లాసులు, గ్లాసులు గోమూత్రాన్ని సేవించారు. గోమూత్రాన్ని మార్నింగ్ 2 చెంచాలు, ఈవినింగ్ 2 చెంచాలు సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారని మహరాజ్ స్వామిజీ చెప్తున్నారు. ఈ గోమూత్ర పార్టీలను కంట్రీ అంతా విస్తరిస్తామని ఆయన తెలిపారు. జీవులను హత్యచేయడం వల్లే  […]

ఏంది కరోనానా..గ్లాసు గోమూత్రంతో పరార్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 14, 2020 | 7:51 PM

‘ఏంది కరోనా వచ్చిందా?’…నో వర్రీస్ …గ్లాసు గోమాత్రం తాగితే అదే పరారవుతుంది అంటున్నారు..అఖిల భారత హిందూ మహాసభల అధ్యక్షుడు చక్రపాణి మహరాజ్ స్వామిజీ. ఇందుకు ఆయన గోమూత్రం పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి వచ్చినవారంతా గ్లాసులు, గ్లాసులు గోమూత్రాన్ని సేవించారు. గోమూత్రాన్ని మార్నింగ్ 2 చెంచాలు, ఈవినింగ్ 2 చెంచాలు సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారని మహరాజ్ స్వామిజీ చెప్తున్నారు. ఈ గోమూత్ర పార్టీలను కంట్రీ అంతా విస్తరిస్తామని ఆయన తెలిపారు.

జీవులను హత్యచేయడం వల్లే  కరోనా ఉద్భవించిందని మహరాజ్ స్వామిజీ చెప్పుకొచ్చారు. ఆ వైరస్‌ను అంతమొందించడానికి ప్రార్థనలు చేస్తున్నామని, గోమూత్రంలో అన్ని రకాల ఔష‌ధ గుణాలు కలగలిసి ఉంటాయని పేర్కొన్నారు. చైనాలో కరోనా వల్ల వైద్యులే చనిపోతున్నారని, అందుకే గోమూత్రం సేవించి ప్రాణాలు కాపాడుకోమని ఆయన సూచిస్తున్నారు. పలువురు మంత్రులు సైతం సీక్రెట్‌గా గోమూత్రాన్ని సేవిస్తారని ఆయన బహిరంగంగానే చెప్పేస్తున్నారు.