AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: అంతా మీ వల్లే.. చైనీయులపై షోయబ్ అక్తర్ విమర్శలు

కరోనా నేపథ్యంలో చైనీయులపై మండిపడ్డారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ఏది పడితే అది తిని చైనీయులు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Coronavirus: అంతా మీ వల్లే.. చైనీయులపై షోయబ్ అక్తర్ విమర్శలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 14, 2020 | 7:39 PM

Share

కరోనా నేపథ్యంలో చైనీయులపై మండిపడ్డారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ఏది పడితే అది తిని చైనీయులు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, ఎలుకలను ఎలా తింటారని.. వాటి రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులను చూస్తుంటే కోపం వస్తోందని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాలో విజృంభించిన కరోనా వలన ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓ చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు.

చైనాపై తనకేం వ్యతిరేకత లేదని.. కానీ జంతువుల పట్ల అంత క్రూరంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. గబ్బిలాలు, కప్పలు, పాములు, కుక్కలు తినడం మా సంస్కృతిలో భాగమని చైనీయులు అనొచ్చు. కానీ ఆ సంస్కృతే మీకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది కదా అని షోయబ్ చెప్పుకొచ్చారు. కోవిడ్ ప్రభావం క్రీడలపైనా పడిందని ఆయన అన్నారు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో షోయబ్ తెలిపారు. కాగా కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌లో జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్‌ లీగ్(పీఎస్ఎల్) సందిగ్దంలో పడగా.. పీఎస్ఎల్ షెడ్యూల్‌ను కుదించిన విషయం తెలిసిందే.

Read This Story Also: హమ్మయ్య.. క్రికెటర్‌కు కరోనా లేదు..!

Follow Us
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
ఆధ్యాత్మిక భారతం.. ఏ ఆలయం చూసినా కిక్కిరిపోతున్న భక్తజనం..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
చాణక్యుడు చెప్పిన గోల్డెన్ రూల్స్: విద్యార్థుల విజయానికి అసలు ..
ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?
ఎన్నికల్లో ఓటేసిన తర్వాత త్రిష తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా?