కోవిడ్‌-19 యాంటీబాడీ టెస్ట్ సక్సెస్.. 98.6% ఖచ్చితత్వంతో..

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో యూకేలో కోవిడ్‌-19 యాంటీబాడీ ప‌రీక్ష‌లు

కోవిడ్‌-19 యాంటీబాడీ టెస్ట్ సక్సెస్.. 98.6% ఖచ్చితత్వంతో..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 6:22 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో యూకేలో కోవిడ్‌-19 యాంటీబాడీ ప‌రీక్ష‌లు 98.6 శాతం ఖ‌చ్చిత‌త్వంతో ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు డైలీ టెలీగ్రాఫ్ తెలిపింది. యూకే ప్ర‌భుత్వం మొద‌టి మేజ‌ర్ ట్ర‌య‌ల్స్‌ను పాస్ చేసిన అనంత‌రం ల‌క్ష‌ల్లో క‌రోనా వైర‌స్ యాంటీబాడీ టెస్ట్‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసేందుకు బ్రిట‌న్ మంత్రులు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లుగా పేర్కొంది.

ఫింగర్‌ప్రిక్ పరీక్షల ద్వారా ఓ వ్య‌క్తి క‌రోనా వైర‌స్ భారిన ప‌డింది లేనిది 20 నిమిషాల్లో 98.6 శాతం ఖ‌చ్చిత‌త్వంతో తెలుసుకోవ‌చ్చు. జూన్‌లో నిర్వ‌హించిన ర‌హ‌స్య ప‌రీక్ష‌ల్లో ఇప్ప‌టికే ఈ విష‌యం నిర్ధార‌ణ అయింది. ఈ ఏడాది చివరిలోపు మాస్ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఉపయోగం కోసం ఎబిసి -19 ల్యాట‌ర‌ల్ ఫ్లో టెస్ట్ అందుబాటులో ఉంటుందని మంత్రులు భావిస్తున్నారు. యూకే ర్యాపిడ్ టెస్ట్ క‌న్సార్టియం(యూకే-ఆర్‌టీసీ), ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ప్ర‌ముఖ యూకే డ‌యాగ్న‌స్టిక్స్ ఫర్మ్స్ సంయుక్తంగా ఈ టెస్ట్‌ను అభివృద్ధి చేశాయి.

Latest Articles