AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ.. కేటుగాళ్ల వ‌ల‌లో ప‌డొద్దు : నటుడు బెన‌ర్జీ

పలువురు సెలబ్రిటీల పేర్లు..లేదా ఆయా సంస్థల పేర్లు చెప్పి సినిమాల్లో ఛాన్స్ లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. . ఈ నేపథ్యంలో ప్రముఖ న‌టుడు.. బెనర్జీ స్పందించారు.

అమ్మాయిలూ.. కేటుగాళ్ల వ‌ల‌లో ప‌డొద్దు : నటుడు బెన‌ర్జీ
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 18, 2020 | 7:21 PM

Share

పలువురు సెలబ్రిటీల పేర్లు..లేదా ఆయా సంస్థల పేర్లు చెప్పి సినిమాల్లో ఛాన్స్ లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. . ఈ నేపథ్యంలో ప్రముఖ న‌టుడు.. బెనర్జీ స్పందించారు.

ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ… ” మాకు అన్నపూర్ణ.. లేదా గీతాఆర్ట్స్ ..మెత్రీమూవీస్ తెలుసు లేదా పలానా డైరెక్ట్ తెలుసు నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాను..లేదా మేనేజర్ గా వర్క్ చేస్తున్నానని మాయమాటలు చెప్పి ముఖ్యంగా ఆడపిల్లలతో మీకు మంచి క్యారెక్టర్స్ ఇప్పిస్తానని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర పర్సనల్ గా ఇన్ ఫర్మెషన్ తీసుకుని వాళ్ళని తప్పుదోవలోకి తీసుకెళ్ళుతున్నారు. ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు చెబుదామని మీ ముందుకు వచ్చాను. యాక్టింగ్ అనేది బ్యాడ్ ఐడియా కాదు..యాక్టర్ అవుదామనేది తప్పుకాదు. ఎవరైనా యాక్టర్ అవ్వొచ్చు. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చేవారు ఎవరిని కలవాలి..ఏం చేయాలి అనే సందిగ్థతలో ఉంటారు. మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఇలా ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి నాకు ఫలానా హీరో..డైరెక్టర్..ఫలానా సంస్థ తెలుసు అని మిమ్మల్ని ఫోటోలు..లేదా డిటైల్స్ పంపించండి లేదా మీరు వచ్చి నన్ను పర్సనల్ గా కలవండి అని ఎవరైనా ఫోన్ చేస్తే మీరు దయచేసి వాళ్ళకి రెస్పాండ్ కావ్వొద్దు. ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళు కూడా అది పెద్ద..చిన్న సంస్థలు అవ్వనివ్వండి వాళ్ళు మీడియేటర్స్ ద్వారా ఫోన్లు చేసి పిలిపించుకోరు. అవసరం ఉంటే వాళ్ళే ఎడ్వటేజ్ మెంట్ లేదా..వాళ్ళ ఆపీసు నుంచి ఫోన్లు చేస్తారు. లేకపోతే వాళ్ళ ఆఫీసు దగ్గరకి రమ్మంటారు. అంతేకాని ఇలా ఫోన్లులో ఫోటోలు పంపించండి. డిటైల్స్ పంపించండి అని ఎటువంటి పరిస్థితిలో అడగరు. మీకు ఉదాహరణకి చెప్పాలంటే బ్యాంకు నుంచి ఫోన్స్ వస్తుంటాయి. మీ పిన్ నెంబర్..మీ పర్సనల్ డిటైల్స్ ఎవ్వరికి..బ్యాంకు వారు ఫోన్ చేసినా ఇవ్వొద్దని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అడగరు అవి అన్నీ. మీ పర్సనల్ డిటైల్ ఇస్తే మీ బ్యాంకులో డబ్బులు మాయమైనట్టు .మీ పర్సనల్ సమాచారం వల్ల మీ పుట్టినతేదీ తదితర విషయాలతో మిమ్మల్ని రకరకాలుగా వాడుకోవచ్చు. అలాగే డిజిటల్ గా చాలా మార్పులు వచ్చాయి. మీ ఫోటోలను మార్ఫింగ్ చేయవచ్చు..ఇవన్నీ నేను ఓపెన్ గా చెప్పలేను.. బి కేర్ ఫుల్. ఎవరైనా బ్యాంక్ ఎకౌంట్ కి డబ్బులు పంపమన్నా పంపవద్దు. ఎవరైనా అలా కాల్ చేస్తే మీరు ఫలానా సంస్థ అంటున్నారు కదా ఆ ఆఫీసుకే నేను వస్తాను..డైరెక్టర్ ని పరిచయం చేయమని అప్పుడు మీ వివరాలు అక్కడ ఇవ్వండని తెలిపారు బెనర్జీగారు. ముఖ్యంగా మీరు అలా వెళ్లినప్పుడు మీకు తోడుగా మీ ఫ్రెండ్..బ్రదర్స్ లాంటి వారిని తోడుగా తీసుకెళ్లితే మీరు సేఫ్ గా ఉంటారు. నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు మోసపోతున్నారు..మోసగాళ్ళ వలలో పడొద్దని విన్నవిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి” అని చెప్పారు బెనర్జీ.