ఆ కూరగాయల మార్కెట్ లో 18 మందికి కరోనా

రాజ‌స్థాన్‌లో కరోనా వైరస్ అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. కూరగాయల మార్కెట్ లో అంటుకున్న వైరస్ పట్టణాన్నే వణికిస్తోంది. దౌసాలోని సబ్జీ మండిలో కూరగాయలు విక్ర‌యించే 18 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో కూరగాయలు కొనుగొలు చేసిన వినియోగదారులకు కూడా కరోనా అంటుకుందోనన్న ఆందోళ‌న ఆధికారుల్లో మొదలైంది.

ఆ కూరగాయల మార్కెట్ లో 18 మందికి కరోనా
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 22, 2020 | 5:58 PM

రాజ‌స్థాన్‌లో కరోనా వైరస్ అంత‌కంత‌కూ విజృంభిస్తోంది. కూరగాయల మార్కెట్ లో అంటుకున్న వైరస్ పట్టణాన్నే వణికిస్తోంది. దౌసాలోని సబ్జీ మండిలో కూరగాయలు విక్ర‌యించే 18 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో కూరగాయలు కొనుగొలు చేసిన వినియోగదారులకు కూడా కరోనా అంటుకుందోనన్న ఆందోళ‌న ఆధికారుల్లో మొదలైంది. నిత్యం రద్దీగా ఉండే దౌసా మార్కెట్ లో 18 మంది కూరగాయల వ్యాపారుల‌కు కరోనా సోకింది. వెంటనే మార్కెట్ ను మూసివేసిన అధికారులు పూర్తిగా శానిటైజేషన్ నిర్వహించారు మున్సిపల్ సిబ్బంది.  దీంతో వారి పాటు వారి కుటుంబసభ్యులకు, పరిచయస్తుల జాబితాను అధికారులు సేక‌రించారు. వీరంద‌రికీ క‌రోనా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని నిర్ణయించారు. అయితే, వ్యాపారుల ద‌గ్గ‌ర కూర‌గాయ‌లు కొనుగోలు చేసినవారిని ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు అధికారులు. కూర‌గాయ‌ల వ్యాపారుల‌కు క‌రోనా సోకింద‌ని తెలుసుకున్న స్థానికులు ఆందోళ‌న‌కు లోన‌వుతున్నారు. దౌసాలో కొత్తగా 20 కరోనా కేసులు న‌మోద‌వ‌డంతో, ఇప్పటివరకు మొత్తం 261కరోనా బారినపడ్డారు. క‌రోనా బాధితుల్లో 219 మంది రోగులు కోలుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం వల్లనే కరోనా వ్యాప్తి చెందుతుందని అధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.