AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకోస్తోన్న కరోనా సెకండ్ వేవ్, 16 రాష్ట్రాల్లో డేంజర్‌ బెల్స్‌.. కరీంనగర్‌ 36 ప్లస్‌.. పశ్చిమగోదావరిలోనూ అలజడి

అయిపోయిందిలే అని ఊపిరిపీల్చుకుంటున్న వేళ దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి. దేశంలోని తెలుగు రాష్ట్రాలు సహా మొత్తంగా 16 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి..

దూసుకోస్తోన్న కరోనా సెకండ్ వేవ్, 16 రాష్ట్రాల్లో డేంజర్‌ బెల్స్‌.. కరీంనగర్‌ 36 ప్లస్‌.. పశ్చిమగోదావరిలోనూ అలజడి
Venkata Narayana
|

Updated on: Feb 23, 2021 | 7:10 PM

Share

అయిపోయిందిలే అని ఊపిరిపీల్చుకుంటున్న వేళ దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి. దేశంలోని తెలుగు రాష్ట్రాలు సహా మొత్తంగా 16 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో జడలు విప్పుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మళ్లీ కరోనా భయంతో హడలిపోతోంది. ఇలాఉంటే, భారత్‌లో కొత్తగా పదివేలకు పైగా కరోనా కేసులు రికార్డులెక్కాయి. 78 మంది చనిపోయారు. అటు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరిలోనూ సెకండ్‌ వేవ్ కలవరం పుట్టిస్తోంది.

అప్పట్లో కరోనా వైరస్‌ క్యారీ అయింది కూడా కరీంనగర్‌ రూట్లోనే. ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్లకి కరోనా సోకడంతో జిల్లా ప్రజలు మొత్తం భయాందోళనలకు గురయ్యారు. గండం గడిచెర సుమతి అనుకునేలోపే ..తాజాగా మళ్లీ గత్తెర తెరపైకి రానే వచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో మళ్లీ కరోనా కలకలం షురూ అయింది. చేగుంట.. దుర్శేడు గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు తేలాయి. బంధువు అంత్యక్రియలకు వెళ్తే 30 మందికి కరోనా సోకింది. ఈ షాక్‌ నుంచి తేరుకోక ముందే కోరుట్లలో బ్యాంక్‌ ఉద్యోగులకు పాజిటివ్‌ అని తేలింది. ఒక్క కరీంనగర్‌ సిటీలో 18 టోటల్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 36 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన అధికారులు ఆగమేఘాల మీద శానిటేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేశారు. మెడికల్‌ టీమ్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌ వణికిస్తున్నా.. జనంలో మాత్రం నిర్లక్ష్యాన్ని వీడ్డం లేదు. చాలా మంది భౌతిక దూరం పాటించడంలేదు. మాస్క్‌లను ధరించడంలేదు. ఇది లైట్‌గా తీసుకునే వ్యవహారం కాదు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, రాజస్థాన్‌లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రజారవాణాపై పరిమితులు విధించారు. రాజస్థాన్‌లోనైతే ఏకంగా 144 సెక్షన్‌ కొనసాగుతోంది. మాస్క్‌ ధరించకపోతే మహారాష్ర్టలో 2వందల జరిమానా విధిస్తున్నారు. మరి తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితి ఏంటి?.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సోమవారం ఒక్కరో జే 36 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. నిబంధనలు పాటించకపోవడమే ముప్పుకు మూలకారణం. నిర్లక్ష్యం తగదు. సెకండ్‌ వేవ్‌ టచ్‌ చేయకముందో ఫ్రంట్‌ వారియర్స్‌గా ప్రతీ ఒక్కరూ స్వీయరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మళ్లీ వచ్చింది.

Read also :

GVMC : టీడీపీ నుంచి నామినేషన్‌ వేసిన అభ్యర్థులపైనే ఫోకస్‌.. స్టీల్‌ సిటీలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ షురూ చేసిన అధికార వైసీపీ