కాంగ్రెస్ నేత హర్ష కుమార్ కరోనా పాజిటివ్ ..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మహమ్మారి బారిన చాలామంది రాజకీయ నాయకులు పడ్డారు.

Corona Positive To Former MP Harsha Kumar: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మహమ్మారి బారిన చాలామంది రాజకీయ నాయకులు పడ్డారు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరికీ కరోనా సోకింది. ఇందులో కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా.. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇక ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయన ఇటీవల టెస్టు చేయించుకోగా.. కరోనా నిర్ధారణ అయింది. హర్ష కుమార్‌తో పాటు ఆయన ఇద్దరు కోడళ్లకు, మనవరాలికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.
Also Read:
ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!
ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…




