AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి, మరో నలుగురు సీరియస్

గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి, మరో నలుగురు సీరియస్
Balaraju Goud
|

Updated on: Aug 17, 2020 | 3:26 PM

Share

గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖేడా జిల్లాలోని నాడియా వద్ద అహ్మదాబాద్-వడోదర ఎనిమిదో నెంబరు జాతీయ రహదారిపై ఈ సోమవారం తెల్లవారు జామున ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో రెండు వాహానాల్లో వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం నాడియా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు పోలీసులు తెలిపారు.బాధితులంతా అహ్మదాబాద్ నగరానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగంతోపాటు నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు పోలీసులు.

Follow Us
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!
అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ.. ఇలా కెమెరాకు దొరికారు..
అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ.. ఇలా కెమెరాకు దొరికారు..
స్టార్ హీరోతో బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. ఇప్పుడు
స్టార్ హీరోతో బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. ఇప్పుడు
అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి..
అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి..
లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
OTTలో బ్లాక్ బస్టర్ మూవీ.. అబ్బాస్ రీఎంట్రీ కోసమైనా చూడాల్సిందే.
OTTలో బ్లాక్ బస్టర్ మూవీ.. అబ్బాస్ రీఎంట్రీ కోసమైనా చూడాల్సిందే.
ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో..
ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో..
పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది!ఏంటా అని వెలికితీయగా కళ్లు
పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది!ఏంటా అని వెలికితీయగా కళ్లు