AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా జిల్లాలో క‌రోనా టెర్ర‌ర్..మ‌ర‌ణాల్లో టాప్ ప్లేస్..

కృష్ణా జిల్లాలో కరోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్-19 వ‌ల్ల జిల్లాలో మ‌ర‌ణించేవారి సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఆదివారం ఒక్క రోజులో మరో 66 పాజిటివ్ కేసులు నమోదవ్వ‌డం గ‌మ‌నార్హం.

కృష్ణా జిల్లాలో క‌రోనా టెర్ర‌ర్..మ‌ర‌ణాల్లో టాప్ ప్లేస్..
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2020 | 6:38 PM

Share

కృష్ణా జిల్లాలో కరోనావైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్-19 వ‌ల్ల జిల్లాలో మ‌ర‌ణించేవారి సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఆదివారం ఒక్క రోజులో మరో 66 పాజిటివ్ కేసులు నమోదవ్వ‌డం గ‌మ‌నార్హం. సోమ‌వారం రిలీజ్ చేసిన వివ‌రాల ప్ర‌కారం మ‌రో 15 మందికి కోవిడ్ సోకింది. జిల్లాలో గత ఐదు రోజుల్లో ప‌ది మంది వైరస్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1063కి చేరింది. వీరిలో 463 మంది వ్యాధి నయ‌మై డిశ్ఛార్జి అయ్యారు. మొత్తం 37 మంది ఇప్పటివరకూ వైరస్ బారినపడి మృతి చెందారు. కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉండ‌టం క‌ల‌వ‌ర‌పెట్టే అంశం.

కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య జూన్ ప్రారంభం నుంచి జిల్లాలో రోజురోజుకు పెరిగిపోయింది. జూన్ 1 నుంచి 21 వరకూ 583 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఈ నెల 15 నుంచి 21 వరకు 347 కేసులు నమోదవ్వ‌డం గమ‌నార్హం. 60 శాతం జూన్​లోనే నమోద‌య్యాయి. విజ‌య‌వాడ సిటీలో కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. అత్య‌ధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. కానీ జనం మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. భౌతిక దూరం అస్స‌లు పాటించ‌డం లేదు. కొంత‌మంది మాస్కులు ధ‌రించ‌డం మానేశారు. అధికారులు రూల్స్ అతిక్ర‌మించేవారిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత