ఆర్టికల్ 370 రద్దు పై.. రాములమ్మ ఏమన్నారంటే..!
ఆర్టికల్ 370 రద్దు పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. జమ్ముకశ్మీర్ విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా స్వాగతించడం శుభపరిణామం అన్నారు. దేశభద్రత దృష్ట్యా తాము కేంద్రానికి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్న దేశభద్రత విషయంలో రాజీపడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతమని ఆమె తెలిపారు. మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మోదీ సర్కార్ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. కశ్మీర్ విభజనతో సుదీర్ఘ కాలంగా రగులుతున్న సమస్యకు […]

ఆర్టికల్ 370 రద్దు పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. జమ్ముకశ్మీర్ విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింథియా స్వాగతించడం శుభపరిణామం అన్నారు. దేశభద్రత దృష్ట్యా తాము కేంద్రానికి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్న దేశభద్రత విషయంలో రాజీపడకూడదన్నది కాంగ్రెస్ సిద్ధాంతమని ఆమె తెలిపారు. మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మోదీ సర్కార్ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. కశ్మీర్ విభజనతో సుదీర్ఘ కాలంగా రగులుతున్న సమస్యకు పరిష్కారం లభించాలని, అక్కడి ప్రజలు సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు విజయశాంతి చెప్పారు.