అవనిగడ్డలో సందడి చేసిన నటుడు అలీ.. పోలీస్ సబ్ డివిజన్ కబడ్డీ పోటీల ప్రారంభం

అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అవనిగడ్డలో సందడి చేసిన నటుడు అలీ.. పోలీస్ సబ్ డివిజన్ కబడ్డీ పోటీల ప్రారంభం
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 11, 2021 | 12:17 AM

Comedian Ali in Avanigadda: ప్రముఖ సినీ నటుడు అలీ కృష్ణాజిల్లా అవనిగడ్డలో సందడి చేశారు. అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొని కబడ్డీ కోర్టులో కూతపెట్టి పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే ఆటలపోటీలను ప్రారంభించడం పట్ల అలీ సంతోషం వ్యక్తం చేశారు. అలీతో కలిసి స్థానిక ఆర్డీవో ఖాజావలీ కబడ్డీ ఆడి అలరించారు. అనంతరం పోటీ విజేతలకు అలీ చేతుల మీద బహుమతి ప్రధానం చేశారు.

ఆటలపోటీలు నిర్వహించడం పట్ల జిల్లా ఎస్పీకి అలీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి జిల్లా ఎస్పీ ఆలోచన అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని అలీ కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్‌పి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.