Alludu Adhurs pre release event: సంక్రాంతి పండుగకు అలరించబోతున్న “అల్లుడు అదుర్స్”.. ఘనంగా ప్రి రిలీజ్ ఈవెంట్
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
అల్లుడు శ్రీనుతో అరంగ్రేటం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సూపర్ హీట్‌తో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. శ్రీనుకు జంటగా నభా నటేశ్, అను ఇమ్మనియెల్ నటించిన అల్లుడు అదుర్స్ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ శనివారం ఘనంగా జరిగింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న అల్లుడు అదుర్స్ చిత్రంలో ముఖ్య పాత్రలలో సోనూ సూద్, ప్రకాష్ రాజ్, మోనాల్ గజ్జర్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్వకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ఈ చిత్రానికి గొర్రెల్ సుబ్రహ్మణ్యం నిర్మాత.
హైదరాబాద్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యాక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు వివి వినాయక్, అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. కందిరీగ సినిమా అంటే బెల్లంకొండ సురేష్ గారికి చాలా ఇష్టమని తెలిపారు. ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమా నిజమైన సంక్రాంతిని తీసుకువస్తుందన్నారు. ఆకలిగా వున్న పులికి ఆహారం దొరికితే ఎలా ఉంటుందో శ్రీనివాస్ కూడా అంతే కసితో డాన్స్ లు ఫైట్స్ చేసాడని వినాయక్ కొనియాడారు. ఇక, దర్శకులు సంతోష్ శ్రీనివాస్ చిత్ర నిర్మాణ గురించి చెబుతూ.. అన్ని విషయాలు కలగలిసిన మంచి సినిమా అల్లుడు అదుర్స్ అన్న ఆయన.. శ్రీనివాస్ బాధ్యతగా ఎక్కడా రాజీ లేకుండా నటించారన్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ కీలకంగా పనిచేశారన్న ఆయన.. కరోనా సమయంలోనూ నిర్మాత సుబ్రహ్మణ్యం ఎక్కడా తగ్గలేదన్నారు.
ఇక, అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కరోనా తరువాత రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ నిన్న క్రాక్ తో ఆడియన్స్ సినిమా హాళ్లకు వచ్చి మరింత ధైర్యాన్ని ఇచ్చారన్నారు. దేవి శ్రీ మంచి ట్యూన్స్ ఇచ్చారు. హీరో శ్రీను సినిమా సినిమాకీ వేరియేషన్స్ చూపిస్తున్నాడు. డాన్సులు ఫైట్లు బాగా చేస్తున్నాడని కొనియాడారు.
హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి శ్రీను అన్న ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారు అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందన్నారు. జనవరి 14న వస్తున్న ఈ సినిమా అందరినీ అలరిస్తుందన్నారు.