ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు, తిరునాళ్ల మాదిరి చలువ పందిళ్లు, ఫ్లడ్ లైట్ వెలుగు జిలుగులు

ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు జోరందుకున్నాయి. పోలీసుల ఆంక్షలు లేవు.. ఎలాంటి హద్దులు లేవు. కోళ్లు.. కాలుదువ్వుతున్నాయి...

  • Venkata Narayana
  • Publish Date - 2:28 pm, Thu, 14 January 21
ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు,  తిరునాళ్ల మాదిరి చలువ పందిళ్లు,  ఫ్లడ్ లైట్ వెలుగు జిలుగులు

ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు జోరందుకున్నాయి. పోలీసుల ఆంక్షలు లేవు.. ఎలాంటి హద్దులు లేవు. కోళ్లు.. కాలుదువ్వుతున్నాయి. బరులు.. జనసందడిగా మారాయి.. కోట్లు చేతులు మారుతున్నాయి. తిరునాళ్ల మాదిరి చలువ పందిళ్లు వేశారు. ఫ్లడ్ లైట్ వెలుగులు జిగేల్ జిగేల్ మంటున్నాయి. ఈ వెలుగుల మధ్య.. నిన్నటి నుంచి మొదలైన కోడిపందేలు అర్థరాత్రి వరకు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 150 నుంచి 200 సెంటర్లలో పందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 20 వేల బరులు సిద్ధం చేశారు. ఒక్కో బరిలో కోట్ల రూపాయల చేతులు మారుతునట్లు తెలుస్తోంది. స్పాట్‌లో ఉండే వారు కొందరైతే.. అక్కడ లేకుండా పందెం కాసే వారు ఇంకొందరు. కోనసీమలోనూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా పందాలు జోరుగా సాగుతున్నాయి. పర్మిషన్ లేదన్న పోలీస్ వార్నింగ్‌లను నిర్వాహకులు పట్టించుకోలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో దర్జాగా బరులు సిద్ధం చేసి.. టెంట్లు వేసి మరీ నోట్ల కట్టల్ని చేతుల్లో పట్టుకొని పందాలకు దిగుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి పందాలు నిర్వహిస్తున్నారు.