సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసు : లొంగిపోయిన నిందితుడు !
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసులో ప్రధాన నిందితుడు భాస్కర్ రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసులో ప్రధాన నిందితుడు భాస్కర్ రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. చాపాడు మండలానికి చెందిన భాస్కర్ రెడ్డి…ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది..
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కులతో బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేశారన్న వ్యవహారంపై బుధవారం ప్రొద్దుటూరులోని మూడు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. వేరు, వేరు బ్యాంకుల్లో మూడు ఫేక్ చెక్కులతో పది లక్షలు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు భాస్కర్‌రెడ్డి.. మూడు చెక్కులతో డబ్బులు డ్రా చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే చెన్నకేశవరెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులను తీసుకొన్నట్టుగా భాస్కర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. భాస్కర్ రెడ్డితో సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read :
మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్