ఈ నెల 10న సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలకు శ్రీకారం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు అక్కడ సీఎం శ్రీకారం...

ఈ నెల 10న సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలకు శ్రీకారం
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 06, 2020 | 5:52 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు అక్కడ సీఎం శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో ప్రభుత్వం పేదలకోసం రూ.163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. సిద్దిపేటలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను, దీనికి అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలోని చింతల్‌చెరువు వద్ద రూ.278 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను సీఎం ప్రారంభించనున్నారు. రంగనాయకసాగర్‌ జలాశయం మధ్య రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని, మిట్టపల్లి రైతువేదికను, విపంచి ఆడిటోరియాన్ని కూడా కేసీఆర్‌ ప్రారంభిస్తారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు మీడియాకు వెల్లడించారు. కోమటిచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగనున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారని చెప్పారు. అటు, జిల్లా కేంద్రమైన సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాలలో నిర్మించిన తెలంగాణ భవన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న మొట్టమొదటి జిల్లా పార్టీ కార్యాలయం ఇదేనని హరీశ్ అన్నారు.

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..