AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొణిదెలవారి ఇంట పెళ్లిసందడి షరూ.. ఘనంగా నిహారిక పెళ్లికుమార్తె వేడుక, నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఫొటోలు

మెగా డాటర్ నిహారిక కొత్తపెళ్లి కూతురయింది.. కొణిదెలవారి ఇంట పెళ్లి సందడి షురూ అయింది. నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యింది.....

కొణిదెలవారి ఇంట పెళ్లిసందడి షరూ.. ఘనంగా నిహారిక పెళ్లికుమార్తె వేడుక, నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఫొటోలు
Venkata Narayana
|

Updated on: Dec 06, 2020 | 5:56 AM

Share

మెగా డాటర్ నిహారిక కొత్తపెళ్లి కూతురయింది.. కొణిదెలవారి ఇంట పెళ్లి సందడి షురూ అయింది. నిహారిక పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యింది. శనివారం నాగబాబు స్వగృహంలో ఈ శుభకార్యాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇంటిని రంగురంగుల పువ్వులు, తోరణాలతో అలంకరించారు. నిహారికకు పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. నిహారిక చిలకపచ్చ రంగు పట్టు చీరలో కళకళలాడారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్‌ తేజ్‌ దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డను నిహారిక మనువాడబోతుంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఈ పెళ్లి తంతు జరగబోతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ శుభకార్యానికి వేదిక కాబోతోంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆగస్టులో నిహారిక – చైతన్యల నిశ్చితార్థం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రీ – వెడ్డింగ్‌ వేడుకలు జరుగుతున్నాయి. చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ చేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్