AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గొంతులు కోస్తుంటే చాలా హాయిగా ఉండేది, గురుగ్రామ్‌ సీరియల్‌ కిల్లర్‌ వెల్లడించిన విస్తుపోయే విషయాలు

గురుగ్రామ్‌ సీరియల్ కిల్లర్ మహమ్మద్‌ రాజి (22) విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య...

గొంతులు కోస్తుంటే చాలా హాయిగా ఉండేది, గురుగ్రామ్‌ సీరియల్‌ కిల్లర్‌ వెల్లడించిన విస్తుపోయే విషయాలు
Venkata Narayana
|

Updated on: Dec 06, 2020 | 5:55 AM

Share

గురుగ్రామ్‌ సీరియల్ కిల్లర్ మహమ్మద్‌ రాజి (22) విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. మూడు రాత్రుళ్లలో ముగ్గురిని హత్య చేసిన బిహార్‌కు చెందిన ఇతడిని గురుగ్రామ్‌ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్‌ 23, 24, 25వ తేదీల్లో ముగ్గురిని హత్య చేసినట్టు రాజి ఒప్పుకున్నాడు. మద్యం ఆశచూసి 23వ తేదీన రాత్రి నగరంలోని లీజర్‌ వ్యాలీ పార్కు సమీపంలో ఓ వ్యక్తిని గొంతుకోసి చంపేశాడు. మరుసటి రోజు రాత్రి ఓ సెక్యూరిటీ గార్డుని సైతం ఇదే తరహాలో ప్రాణాలుతీశాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, అదుపులోకి తీసుకొని విచారించగా తన వికృత చేష్టలను బయటపెట్టాడు. మనుషుల గొంతు కోస్తుంటే చాలా ఆనందంగా ఉండేదని కూడా మహమ్మద్ రాజీ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, చిన్నతనం నుంచే నాకేం అర్థమయ్యేది కాదని. నేను చాలా బలహీనంగా ఉన్నానని, ఏ పనీ చేయలేనని అందరూ తన్ను ఎద్దేవా చేసేవారని.. అందుకే నేనేం చేయగలనో ప్రపంచానికి చూపించాలనుకున్నా అని రాజి పోలీసుల వద్ద చెప్పుకొచ్చాడు. 25వ తేదీ రాత్రి మరో హత్య చేసినట్లు వెల్లడించాడు. నిందితుడ్ని వెంటబెట్టుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాకేశ్‌ కుమార్‌ (26) అనే వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి శరీరం నుంచి తలను వేరుచేసి మరో ప్రాంతంలో పడేసిన తలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు గురుగ్రామ్‌తోపాటు, ఢిల్లీ, బిహార్‌లో దాదాపు 10 హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది.

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..