మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆరెస్‌కు ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ప్రజలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు కేసీఆర్. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మీ లక్ష్యం కోసం మీరు పనిచేయండి అని ప్రజలు ఆదేశించారు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాల చెంప చెళ్లుమనిపించారు. ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపకుంటే కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలవడం ఆనవాయితీగా మారింది. ప్రజలు అద్భుతమైన […]

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆరెస్‌కు ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ప్రజలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు కేసీఆర్. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మీ లక్ష్యం కోసం మీరు పనిచేయండి అని ప్రజలు ఆదేశించారు. తెలంగాణ ప్రజలు ప్రతిపక్షాల చెంప చెళ్లుమనిపించారు. ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపకుంటే కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలవడం ఆనవాయితీగా మారింది. ప్రజలు అద్భుతమైన తీర్పు చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నా ఆశీస్సులు. అన్ని జిల్లాల్లోనూ ప్రజలు ఒకేరకమైన తీర్పు ఇచ్చారు. మా పధ్ధతి ప్రజలకు బాగా నచ్చిందని కేసీఆర్ అన్నారు. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు. ప్రజల తీర్పును ప్రతిపక్షాలు అవమానిస్తున్నాయి. ఆరేళ్ళ టీఆరెస్ పాలనకు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. త్వరలో తెలంగాణాలో పట్టణ ప్రగతిని అమలుచేయబోతున్నామని కేసీఆర్ తెలిపారు.
ఓ పార్టీకి చెందిన ఎంపీపై కేసీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అనే కనీస మర్యాద లేకుండా ముక్కు కోస్తా అంటూ వ్యాఖ్యానించడం ఏంటని అన్నారు. ఇదేనా జాతీయ పార్టీల పద్ధతి? ఇదేనా ఆ పార్టీ సంస్కారం అని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో నేను ఏ ఒక్క అధికారితో మాట్లాడలేదు. తెలియకుండానే వేలకోట్లు ఖర్చు పెట్టాం అని ఎలా అంటారు..?. ఓటేసిన ప్రజలను అవమానిస్తారా..? ఇప్పటికైనా ప్రతిపక్షాలు హుందాగా, గౌరవంగా వ్యవహరించాలి. ఇతర పార్టీలకు ఇది పొలిటికల్ గేమ్.. మాకు మాత్రం టాస్క్. అని కేసీఆర్ స్పష్టంచేశారు.
సీఏఏ తప్పుడు నిర్ణయమని కేసీఆర్ తెలిపారు. ముస్లింలను ఎలా పక్కన పెడతారని అయన ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుకు సపోర్ట్ చేశామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సీఏఏకు వ్యతిరేకంగా త్వరలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వివరించారు. సీఏఏకు వ్యతిరేకంగా పది లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తామని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి, అరాచకం, విచ్చలవిడి తనాన్ని ఉపేక్షించబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎవరు ఏమనుకున్నా భయపడేది లేదన్నారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని కచ్చితంగా తీసుకొస్తామని స్పష్టం చేశారు.