రాత్రి కాంగ్రెస్-ఎం.ఐ.ఎం గొడవ.. విరుచుకుపడ్డ షబ్బీర్ అలీ

హైదరాబాద్ వరద బాధిత ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, స్వచ్ఛంద సంస్థలపై ఎం.ఐ.ఎం గుండాలు దాడులకు పాల్పడుతున్నారని తెలంగాణ శాసనమండలి మాజీ ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. రాత్రి షబ్బీర్ అలీతో పాటు హైదరాబాద్ కాంగ్రెస్ మైనారిటీల విభాగం చైర్మన్ సమీర్ వలీల్లా, టిపిసిసి ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, సీనియర్ నాయకుడు అశ్వక్ మొహమ్మద్ ఖాన్ తదితరులు మలక్ పేట్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి […]

రాత్రి కాంగ్రెస్-ఎం.ఐ.ఎం గొడవ.. విరుచుకుపడ్డ షబ్బీర్ అలీ
Follow us

|

Updated on: Oct 19, 2020 | 7:34 AM

హైదరాబాద్ వరద బాధిత ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, స్వచ్ఛంద సంస్థలపై ఎం.ఐ.ఎం గుండాలు దాడులకు పాల్పడుతున్నారని తెలంగాణ శాసనమండలి మాజీ ప్రతిపక్ష నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. రాత్రి షబ్బీర్ అలీతో పాటు హైదరాబాద్ కాంగ్రెస్ మైనారిటీల విభాగం చైర్మన్ సమీర్ వలీల్లా, టిపిసిసి ప్రతినిధి సయ్యద్ నిజాముద్దీన్, సీనియర్ నాయకుడు అశ్వక్ మొహమ్మద్ ఖాన్ తదితరులు మలక్ పేట్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం, దుప్పట్లు, ఆర్థిక సహాయం చేశారు. అయితే, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో పాటు రౌడీల ముఠాగా ఈ ప్రాంతానికి వచ్చి సహాయక పంపిణీని ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చాదర్‌ఘాట్ పోలీసుల సకాలంలో జోక్యం చేసుకొని రెండు గ్రూపులను చెదరగొట్టడంతో పెద్ద ఘర్షణ తప్పించింది. పార్లమెంటు, అసెంబ్లీ, జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలో వరద బాధితులకు సహాయం చేయడంలో మజ్లీస్ నాయకులు విఫలమయ్యారని షబ్బీర్ విమర్శించారు.

Latest Articles