చిరు చిందేస్తే, అభిమానులు చొక్కాలు చిరిగిపోవాల్సిందే !

బాస్, మాస్, మెగాస్టార్, బాఫ్ ఆఫ్ డ్యాన్స్... ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఆయ‌నకు యాప్ట్ అవుతుంది. ఇప్ప‌డంటే హ‌డావిడి తగ్గింది గానీ, ఒక‌ప్పుడు సినిమాలు చూడ‌టానికి థియేట‌ర్ల‌కు ఎగ‌బ‌డి వెళ్లేవారు.

చిరు చిందేస్తే, అభిమానులు చొక్కాలు చిరిగిపోవాల్సిందే !
Follow us

|

Updated on: Aug 22, 2020 | 12:17 PM

బాస్, మాస్, మెగాస్టార్, బాఫ్ ఆఫ్ డ్యాన్స్… ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఆయ‌నకు యాప్ట్ అవుతుంది. ఇప్ప‌డంటే హ‌డావిడి తగ్గింది గానీ, ఒక‌ప్పుడు సినిమాలు చూడ‌టానికి థియేట‌ర్ల‌కు ఎగ‌బ‌డి వెళ్లేవారు. అందులోనూ మెగాస్టార్ సినిమా అంటే ఆ రేంజ్ వేరు. భారీ సంఖ్య‌లో క్యూ లైన్లు, అదిరిపోయే కటౌట్లు, పాలాభిషేకం, గ‌జ‌మాల‌లు, అంత‌కుమించి అభిమానుల కోలాహాలం. ఇవ‌న్నీ ఒక ఎత్తు. చొక్కా చిర‌గ‌కుండా చిరంజీవి సినిమా సంపాదించ‌డం ఒక ఎత్తు. ఈ విష‌యం ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక చిరు డ్యాన్స్…ఆలిండియా ఫేవ‌రెట్. అంద‌రూ డ్యాన్స్ మాత్ర‌మే చేస్తారు. కానీ చిరంజీవి ఆ డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తారు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆయ‌న ముఖక‌వ‌ళిక‌లు గ‌మ‌నిస్తే ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఎంత‌మందికో రోల్ మోడ‌ల్. ఎవ‌ర్‌గ్రీన్ టాలెంటెడ్. రీల్ హీరో మాత్ర‌మే కాదు, బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఆయ‌న రియ‌ల్ హీరో కూడా అనిపించుకు‌న్నారు చిరంజీవి.

అంతేకాదు…ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభం వచ్చి అంద‌రూ క‌ష్టాలు ఎదుర్కొంటోన్న స‌మ‌యంలో ఆయ‌న త‌న ప‌రిశ్ర‌మ జ‌నాల‌ను ఆదుకునేందుకు ముందుగా నడుం బిగించారు. సీసీసీ ట్ర‌స్ట్ స్థాపించి, విరాళాలు సేక‌రించి పరిశ్ర‌మకు చెందిన విభిన్న వ‌ర్గాల‌కు స‌ర‌ఫ‌రా చేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌ పేరులానే చిరంజీవి నిండు నూరేళ్లు చిరంజీవిలా సుఖసౌఖ్యాల‌తో వ‌ర్థిల్లాల‌ని కోరుకుంటుంది టీవీ9. హ్యాపీ బ‌ర్త్ డే మెగాస్టార్.

Also Read :

 ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !

వైఎస్సార్ చేయూత అమలుకు కమిటీలు : ఉత్త‌ర్వులు జారీ

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక