AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70 కి.మీ. సాహస యాత్ర..

బిడ్డల ఆకలి, దాహం తీర్చడానికి తల్లిదండ్రులు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని మనుషుల గురించే కాదు.. పక్షుల విషయంలోనూ నిజమని నిరూపిస్తుంది ఈ వింత పక్షి. తన గూటిలోని పసికూనల దాహం తీర్చడం కోసం ఏకంగా 70 కిలోమీటర్లు ప్రయాణించడమే కాకుండా.. తన శరీర ఈకలనే వాటర్ ట్యాంకర్‌లా మార్చుకుని నీటిని మోసుకెళ్తుంది. ప్రకృతికే విస్మయం కలిగించే సాండ్‌గ్రౌస్ పక్షి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70 కి.మీ. సాహస యాత్ర..
How Sandgrouse Carry Water To Chicks
Krishna S
|

Updated on: Oct 25, 2026 | 8:26 PM

Share

ప్రకృతి సృష్టిలో తల్లి ప్రేమకు హద్దులు ఉండవని నిరూపించే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఆహారం, నీటి కోసం మనుషులే కాకుండా జంతువులు, పక్షులు పడే కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా తీవ్రమైన ఎండలు, నీటి చుక్క దొరకని శుష్క ప్రాంతాల్లో జీవించే వన్యప్రాణులకు ప్రతి రోజూ పెను సవాలే. అయితే గూటిలో ఉన్న తన పిల్లల దాహాన్ని తీర్చడం కోసం ఏకంగా 60 నుండి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. తన శరీర భాగాలనే వాటర్ ట్యాంకర్‌లా మార్చుకుని నీటిని మోసుకెళ్లే ఒక అరుదైన పక్షి కథ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుత పక్షి పేరు సాండ్‌గ్రౌస్. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ రాణిపూర్ టైగర్ రిజర్వ్ పరిసరాల్లో ఇది కనిపిస్తుంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని తీవ్రమైన వేడి, రాతి నేలలు, నీటి కొరత ఉండే పొడి వాతావరణంలో ఈ పక్షులు జీవిస్తాయి. వన్యప్రాణి నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. సాండ్‌గ్రౌస్‌లో అనేక ఉపజాతులు ఉన్నాయి. ఇవి సాధారణంగా గడ్డి విత్తనాలు, చిన్నచిన్న ధాన్యపు గింజలను తింటూ జీవనం సాగిస్తాయి.

70 కిలోమీటర్ల సుదూర ప్రయాణం

విత్తనాలు, ధాన్యాలు తినే పక్షులకు జీర్ణక్రియ కోసం నీరు అత్యంత అవసరం. అయితే ఈ పక్షులు ఆవాసం ఉండే రాతి, ఎడారి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర నీటి జాడే ఉండదు. ముఖ్యంగా సంతానోత్పత్తి సమయంలో పిల్లలు ఎగరలేక గూటిలోనే ఉండిపోతాయి. ఆ పసికూనల దాహం తీర్చడం కోసం తల్లి, తండ్రి సాండ్‌గ్రౌస్ పక్షులు ఏమాత్రం వెనుకాడకుండా ప్రతిరోజూ 60 నుంచి 70 కిలోమీటర్ల మేర ప్రయాణించి సుదూర తీరాల్లోని నదులు, చెరువుల వద్దకు చేరుకుంటాయి.

స్పాంజ్ లాంటి ఈకలు.. ఒంటినే ట్యాంకర్‌గా మార్చే టెక్నిక్..

ఈ పక్షి నీటిని మోసుకెళ్లే పద్ధతి ప్రకృతికే విస్మయం కలిగిస్తుంది. పక్షులు తమ నోటితో పిల్లలకు నీటిని మోసుకెళ్లడం చాలా కష్టం. అందుకే ప్రకృతి సాండ్‌గ్రౌస్ పొట్ట, ఛాతీ భాగంలోని ఈకలకు ఓ విశిష్ట నిర్మాణాన్ని ప్రసాదించింది. నీటి వనరు వద్దకు వెళ్లిన మగ లేదా ఆడ సాండ్‌గ్రౌస్, నీటిలో దిగి తన పొట్ట భాగాన్ని పూర్తిగా ముంచుతుంది. వీటి ఈకలు సూక్ష్మమైన కాయిల్ లాంటి నిర్మాణంతో ఉండి, నీటిని వేగంగా పీల్చుకుని స్పాంజ్‌లా నిల్వ ఉంచుకోగలవు. ఆ ఈకలు గాల్లో వేగంగా ఎగిరినప్పటికీ నీరు ఆవిరైపోకుండా లేదా జారిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి.

గూటికి చేరి పసిగుడ్ల దాహం తీర్చి..

ఈకలలో తగినంత నీరు నిండిన తర్వాత, ఆ పక్షి వేగంగా గగనవీధిలోకి ఎగిరి తన గూటికి చేరుకుంటుంది. గూటికి చేరగానే తల్లి లేదా తండ్రి నిల్చుంటే, పిల్ల పక్షులు తమ ముక్కులతో తల్లి రొమ్ము ఈకలను ఒత్తుతూ ఆ తడి ఈకల నుంచి చుక్క చుక్కా నీటిని తాగుతాయి. పిల్లలకు రెక్కలు వచ్చి, సొంతంగా ఎగరడం నేర్చుకునే వరకు ఈ తల్లిదండ్రులు రోజుకు రెండు మూడు సార్లు ఈ సుదీర్ఘ సాహస యాత్రను అలసట లేకుండా కొనసాగిస్తాయి. పరిమిత నీటి వనరులు, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సాండ్‌గ్రౌస్ పక్షి జీవనం సాగిస్తున్న తీరు, పిల్లల కోసం అది పడే తపన జంతుప్రేమికులను కట్టిపడేస్తోంది. ప్రకృతి ఇచ్చిన ప్రతికూలతలను తట్టుకుంటూ జీవులు ఎలా పరిణామం చెందాయో చెప్పడానికి ఈ పక్షి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

Follow Us
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!
సౌందర్య కాదు మధ్యతరగతి పాత్రలకు అద్భుతంగా సెట్ అయ్యే హీరోయిన్ తనే
సౌందర్య కాదు మధ్యతరగతి పాత్రలకు అద్భుతంగా సెట్ అయ్యే హీరోయిన్ తనే
బావపై దాడి చేసి జననాంగాలు కొరికిన మరదలు!
బావపై దాడి చేసి జననాంగాలు కొరికిన మరదలు!