ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

రాష్ట్రంలో జ‌రిగే ఉద్యోగుల బ‌దిలీలు, నియామ‌కాలు పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి. ఎటువంటి అక్ర‌మాలు, ఒత్తిళ్ల‌కు తావుండ‌కూడ‌దు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కార్ ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ
Follow us

|

Updated on: Aug 22, 2020 | 7:24 AM

రాష్ట్రంలో జ‌రిగే ఉద్యోగుల బ‌దిలీలు, నియామ‌కాలు పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి. ఎటువంటి అక్ర‌మాలు, ఒత్తిళ్ల‌కు తావుండ‌కూడ‌దు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కార్ ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టింది. బదిలీలు, నియామకాల పాలసీపై మరింత అధ్యయనం చేయాల‌ని నిర్ణ‌యించింది. బదిలీలు, నియామకాల విధానం పునః సమీక్షకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్వ‌ర్వులు జారీ చేసింది.

కమిటీ ఛైర్‌పర్సన్‌గా సీఎస్‌ నీలం సాహ్నీని నియమించింది. కమిటీ సభ్యులుగా సీసీఎల్ఏ, డీజీపీ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి ఉంటారు. 14 రోజుల్లో బదిలీలు, నియామకాల పాలసీ పునః సమీక్షపై నివేదిక ఇవ్వాలని కమిటీని గ‌వ‌ర్న‌మెంట్ ఆదేశించింది.

Also Read : నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు