పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !

తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ స‌మీపంలోని బాలా గ్రామానికి చెందిన ప్రతీక్‌ తండాలే అనే ఆర్టిస్ట్ సరికొత్త ఆలోచ‌న‌తో ముందుకు వచ్చాడు.

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !
Follow us

|

Updated on: Aug 22, 2020 | 8:34 AM

క‌రోనా వ‌చ్చి ప్రపంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ మాయ‌దారి వైర‌స్ ప్ర‌జ‌ల జీవన‌వ్య‌వ‌స్థ‌ను చిన్నాభిన్నం చేసింది. ఏ పని చేద్దామ‌న్నా, ఎటు వైపు నుంచి ఏ ముప్పు వ‌స్తుందో తెలియ‌కుండా అయిపోయింది. దేశ‌మంతా ఎంతో ఘ‌నంగా చేసుకునే గ‌ణేశ్ ఉత్స‌వాలు కూడా ఈ సారి మాములుగా జ‌రుగుతున్నాయి. పండుగ‌ను ఇంట్లోనే జ‌రుపుకోవాల‌ని ప్ర‌భుత్వాలు కోరాయి. మ‌రో వైపు ఎకో ఫ్రెండ్లీ నినాదం కూడా జ‌నంలోకి బాగానే వెళ్తుంది.

తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ స‌మీపంలోని బాలా గ్రామానికి చెందిన ప్రతీక్‌ తండాలే అనే ఆర్టిస్ట్ సరికొత్త ఆలోచ‌న‌తో ముందుకు వచ్చాడు. పండుగకు కొద్ది రోజుల ముందుగా పొలంలో తన మిత్రుల‌ సహాయంతో విఘ్నేశ్వ‌రుడి రూపాన్ని గీసి, అందులో విత్తనాలను చల్లి పంట పండించాడు. 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడువు ఉన్న ఈ భారీ ఎకోఫ్రెండ్లీ వినాయకుడు ఇప్పుడు అంద‌ర్నీ ఆక‌ర్షిస్తున్నాడు. ప్రతీక్‌ ఆలోచనను అభినందిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వినాయకుడికి సంబంధించిన వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సుమారు 45 రోజుల పాటు శ్రమించి ప్ర‌తీక్, అత‌డి మిత్రులు ఈ ఎకోఫ్రెండ్లీ వినాయకుడిని రూపొందించార‌ట‌.