ట్రంప్ కు తగిన శాస్తి జరిగిందంటోన్న చైనా

కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించింది చైనా అంటూ మొదటినుంచీ గుస్సాగానే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, ఆయన కరోనా వైరస్ ను చైనా వైరస్ అని సంబోధించడం అనేక సందర్బాల్లో జరిగింది. ఈ మాటల్ని ఆయన పదే పదే సమర్థించుకున్నారు కూడా అయితే, ఇది గతం. ఇప్పుడు ఈ మహమ్మారికి అగ్రరాజ్యం అధినేత అయిన ట్రంప్ కూడా దొరికేశారు. ఇంకేముందు చైనా ఒక్కసారిగా చంకలు కొట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొవిడ్ ని […]

ట్రంప్ కు తగిన శాస్తి జరిగిందంటోన్న చైనా
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 02, 2020 | 8:14 PM

కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించింది చైనా అంటూ మొదటినుంచీ గుస్సాగానే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, ఆయన కరోనా వైరస్ ను చైనా వైరస్ అని సంబోధించడం అనేక సందర్బాల్లో జరిగింది. ఈ మాటల్ని ఆయన పదే పదే సమర్థించుకున్నారు కూడా అయితే, ఇది గతం. ఇప్పుడు ఈ మహమ్మారికి అగ్రరాజ్యం అధినేత అయిన ట్రంప్ కూడా దొరికేశారు. ఇంకేముందు చైనా ఒక్కసారిగా చంకలు కొట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొవిడ్ ని తక్కువ చేసి చూపుతూ, దాంతో పేకాటాడేందుకు ప్రయత్నించారని, అందుకు ఆయన, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తగిన మూల్యం చెల్లించారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చీఫ్ ఎడిటర్ హు షిజిన్ ట్వీట్ చేశారు.

ట్రంప్, మెలానియాలకు కరోనా సోకిందన్న వార్తలే అమెరికాలో కరోనా పరిస్థితికి అద్దం పడుతున్నాయని చైనా మీడియా చీఫ్ విమర్శించారు. ఈ పరిస్థితి ట్రంప్ ప్రతిష్ఠపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని భావిస్తున్న ఆయన ఆశలకు ప్రతిబంధకంగా మారనుందని హు షిజిన్ జ్యోతిష్యం చెప్పారు.