ఇజ్రాయెల్‌లో చైనా రాయబారి అనుమానాస్పద మృతి
ఇజ్రాయెల్‌లోని చైనా రాయబారి తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 58 ఏళ్ల డువ్యూ ఇజ్రాయోల్‌లో చైనా రాయబారిగా ఫిబ్రవరిలో నియమితులయ్యారు. ఆయన గతంలో ఉక్రెయిన్‌కు చైనా రాయబారిగా సేవలందించారు. డువ్యూకు భార్య, ఒక కుమారడు ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ ఆయనతో లేరు. ఈ ఘటనను ఇజ్రాయెల్ అధికారులు సీరియస్ […]

ఇజ్రాయెల్‌లోని చైనా రాయబారి తన ఇంటిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
58 ఏళ్ల డువ్యూ ఇజ్రాయోల్‌లో చైనా రాయబారిగా ఫిబ్రవరిలో నియమితులయ్యారు. ఆయన గతంలో ఉక్రెయిన్‌కు చైనా రాయబారిగా సేవలందించారు. డువ్యూకు భార్య, ఒక కుమారడు ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ ఆయనతో లేరు. ఈ ఘటనను ఇజ్రాయెల్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
ఖండించిన రెండు రోజులకే..
ఇజ్రాయెల్‌లో చైనా ఇన్వెస్ట్ మెంట్స్ పై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన కాంమెంట్స్ ను ఖండించిన రెండు రోజులకే… రాయబారి మృతి చెందడం పలు అనుమానాలు తావిస్తోంది. కరోనా వైరస్ వాస్తవాలను చైనా దాచిపెట్టిందని అమెరికా ఇప్పటికీ ఆరోపిస్తోపన్న విషయం తెలిసిందే.
