ఇండియాను రెచ్ఛగొడుతున్న చైనా , అరుణాచల్ సమీపాన మూడు గ్రామాల ‘నిర్మాణం’, కబ్జాకేది అనర్హం?

లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియాతో ఉద్రిక్తతలు పెంచుతున్న చైనా.. మరో 'రెచ్ఛగొట్టుడు  చర్యకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. 960 కుటుంబాలతో..

ఇండియాను రెచ్ఛగొడుతున్న చైనా , అరుణాచల్ సమీపాన మూడు గ్రామాల 'నిర్మాణం', కబ్జాకేది అనర్హం?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 06, 2020 | 3:57 PM

లడాఖ్ లోని నియంత్రణ రేఖ వద్ద ఇండియాతో ఉద్రిక్తతలు పెంచుతున్న చైనా.. మరో ‘రెచ్ఛగొట్టుడు  చర్యకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో ఏకంగా మూడు గ్రామాలనే ఏర్పాటు చేసింది. 960 కుటుంబాలతో కూడిన సుమారు మూడున్నర వేల మందిని వలంటరీ బేసిస్  పై (వారే స్వచ్ఛందంగా ) వచ్ఛేట్టు వారిని ఈ గ్రామాలకు తరలించింది. వీరిలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సభ్యులు, టిబెటన్లు కూడా ఉన్నారట.. పశ్చిమ అరుణాచల్ లో భారత్-చైనా-భూటాన్ మధ్య మూడు జంక్షన్లు కలిసే చోట బుమ్ లా కనుమ వద్ద ఈ గ్రామాలు వెలిశాయి. అరుణాచల్ సరిహద్దు భూభాగం తమదేనని వాదించే డ్రాగన్ ఈ వినూత్న ఆక్రమణకు పాల్పడింది. ఈ ప్రాంతంలో ఇండియాకు, తమ దేశానికి మధ్య సరిహద్దు వివాదమే లేదని, ఇది తమకే చెందినదని బీజింగ్ అంటోంది. ప్రాదేశిక హక్కులు తమవేనంటున్న ఆ దేశం ఈ గ్రామాలతో ‘హాన్ చైనీస్’ అనే పేరిట   సముదాయాన్ని ఏర్పాటు చేసిందని చైనా చర్యలను నిశితంగా పరిశీలించే డా.బ్రహ్మా చలానే అనే నిపుణుడు తెలిపారు. సౌత్ చైనా సీ లో తన జాలరులను  చొరబాట్లకు ఎలా వినియోగిస్తోందో అలా ఆ దేశం భారత గస్తీ దళ పరిధిలోని హిమాలయాల్లో దుందుడుకు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు.

ఈ మేరకు హై రిసోల్యుషన్ శాటిలైట్ ఇమేజీలను కూడా చూపారు. డోక్లామ్ సైనిక ఘర్షణ జరిగిన స్థలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో చైనా గ్రామాల నిర్మాణాన్ని ఈ ఇమేజీలు కళ్ళకు కడుతున్నాయి. 2017 లో భారత, చైనా దేశాల మధ్య డోక్లామ్ ఘర్షణ చాలా రోజులపాటు జరిగింది. ఇటీవల లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద ఉభయ దేశాల మధ్య ఎనిమిది దఫాలుగా చర్చలు జరిగినా ఉద్రిక్తతలు తగ్గని విషయాన్ని బ్రహ్మా చలానె గుర్తు చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ గ్రామాన్నిచైనా  ఎంచక్కా నిర్మించినట్టు ప్లానెట్ లాబ్స్ తీసిన ఇమేజీ కూడా చూపుతోంది. ఈ 2గ్రామంలో 20 కి పైగా కట్టడాలు కనిపిస్తున్నాయి. ఇక నవంబరు 28 న కనీసం మరో 50 కట్టడాలు దృశ్యమిచ్చాయి. ప్రతి కట్టడానికి, సముదాయానికి మధ్య కిలోమీటర్ దూరం ఉన్నట్టు ఈ ఇమేజీలు చూపుతున్నాయి. వీటిని పలు రోడ్లు కలుపుతున్నాయి. సౌత్ టిబెట్ రీజన్ లో 65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా మ్యాపులు కూడా చూపుతున్నాయి. ఇది తమకే చెందినదన్న భారత వాదనను బీజింగ్ కొట్టిపారేస్తోంది. నిజానికి  బ్రిటిష్ పాలనాధికారి సర్ హెన్రీ మెక్ మోహన్ సమక్షంలో 1914 లో ఈ భూభాగానికి సంబంధించి ఉభయదేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. చైనా నిర్మించిన కొత్త గ్రామాల్లో నీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ యాక్సెస్ సౌకర్యాలు కూడా ఉండడం విశేషం. కాగా.. ఇంత జరుగుతున్నా ఆ దేశానికి భారత్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ తన ‘అనుచిత ఉదార హృదయాన్ని’ చాటుకుంటోంది.