AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైఫ్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ విలన్.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు.. 

ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. 'ఆదిపురుష్' సినిమా గురించి సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు

సైఫ్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ విలన్.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు.. 
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2020 | 6:09 PM

Share

ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‏తో టీ-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించి, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువాదం చేయనున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా గురించి సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

‘ఆదిపురుష్’ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం గురించి ఓ మీడియాతో సైఫ్ మాట్లాడుతూ.. ఈ మూవీలో రావణుడిలోని మరో కోణాన్ని, మానవత్వాన్ని చూపించబోతున్నాం. తన చెల్లికి జరిగిన అవమానానికి బదులుగా సీతను రావణుడు ఎత్తుకెళ్ళడం కరెక్టే.. అనేలా ఈ చిత్రికరించబోతున్నామని తెలిపాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడిన మాటలు అతడిని వివాదాల్లోకి నెట్టాయి.

తాజాగా సైఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రామ్ కదంతోపాటు మరికొందరు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ఆయన మాటలు షాక్‏కు గురిచేశాయని రామ్ కదం ట్వీట్ చేశారు. రావణుడిని మంచివాడిగా తెరపై చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనిపై సైఫ్ స్పందిస్తూ.. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని తెలిపారు. వాస్తవ కథను వక్రీకరించకుండా సినిమాను తెరకెక్కించబోతున్నారని స్పష్టం చేశారు. “నేను ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాల్సి దెబ్బతీశాయని, వివాదానికి తెరతీశాయని తెలిసింది. నా ఉద్దేశం ఏ మాత్రం కాదు. ఇందుకు ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నా, నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా. రాముడు ధర్మానికి, వీరత్వానికి చిహ్నంగా నేను భావిస్తాను. చెడుపై మంచి సాధించిన విజయం చుట్టూ ఆదిపురుష్ సినిమా ఉంటుంది. కథను వక్రీకరించకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తీసే దిశగా మొత్తం చిత్రయూనిట్ శ్రమిస్తోంది” అని సైఫ్ వివరించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ 2020 ఆగస్టు 11న విడుదల కాబోతోంది.

ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..