భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిన మంత్రి కేటీఆర్.. 8న జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమాలు చేస్తామని వెల్లడి..
తెలంగాణ భవన్‌లో కొత్తగా ఎంపికైన కార్పోరేటర్లు, బల్దియాలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. గ్రేటర్ ఫలితాలపై సమీక్ష చేస్తున్నారు. ఇదే సమావేశంలో మేయర్ ఎంపిక గురించి స్పష్టత ...
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ తరపున సెల్యూట్ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 8న చేస్తున్న భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. మంత్రులు, పార్టీ సభ్యులు, కార్యకర్తలు అందరూ జాతీయ రహదారులపై ధర్నా చేస్తామని వెల్లడించారు.
LIVE NEWS & UPDATES
-
రైతుల బంద్‌కు మీడియా కూడా సహకరించాలి: మంత్రి కేటీఆర్
రైతుల బంద్‌కు మీడియా కూడా సహకరించాలని కేటీఆర్ కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మేయర్ ఎన్నిక గురించి తర్వాత సమావేశంలో మాట్లాడుకుందామని తెలిపారు. ఎందుకంటే దేశంలో రైతులకంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశారు.
-
రైతులందరు బంద్‌లో పాటించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణ రైతులందరు బంద్‌లో పాటించాలని కోరారు.
-
-
12 గంటలకు షాప్స్ తెరవాలని వ్యాపారులకు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్..
ప్రతి వ్యాపారవేత్త 12 గంటలకు షాప్స్ తెరిచి రెండు గంటలు బంద్ పాటించాలని కేటీఆర్ వ్యాపారులకు పిలుపునిచ్చారు. ట్రాన్స్ పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ బంద్ కు సహకరించాలన్నారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లమీదకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
-
భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ తరపున సెల్యూట్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 8న చేస్తున్న భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. మంత్రులు, పార్టీ సభ్యులు, కార్యకర్తలు అందరూ జాతీయ రహదారులపై ధర్నా చేస్తామని తెలిపారు.
-
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి..
సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ఈ బిల్లు గురించి చర్చ జరిగినప్పడు టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించి, పోరాడారన్నారు.
-
-
రానున్న ఐదేళ్లలో చిత్తశుద్ధితో పనిచేయాలి..
రానున్నఐదేళ్లలో ప్రజలతో ఎలా మెలగాలనే అంశాలపై కార్పొరేట్లర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు టీఆర్ఎస్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు.
-
మేయర్ పీటంపై అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంట..
టీఆర్‌ఎస్‌కు మ్యాజిక్ ఫిగర్ రానందున మేయర్ పీటం ఎవరు గెలుచుకుంటారనేది తెలియడం లేదు. ఇతర పార్టీలు కూడా మేయర్ పీటం కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయని తెలుస్తోంది. దీంతో భాగ్యనగర మొదటి పౌరురాలు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.
-
అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నూతన కార్పొరేటర్లు..
మేయర్ పీటం గెలుచుకోవడానికి టీఆర్ఎస్‌కు మ్యాజిక్ ఫిగర్ రానందున పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలో టెన్షన్ నెలకొని ఉంది. ఇతర పార్టీల మద్దతు కోరుతుందా లేదంటే ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచిస్తుందా తెలియడం లేదు.
-
మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలుపుతున్న నూతన కార్పొరేటర్లు..
నూతనంగా గెలిచిన కార్పొరేటర్లందరు మంత్రి కేటీఆర్‌ను మర్యాపూర్వకంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అనంతరం ఆత్మీయంగా ఫొటోలు దిగుతున్నారు. మంత్రి కేటీఆర్ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
-
తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మహిళా కార్పొరేటర్లు
మేయర్ పీటం మహిళకు రిజర్వ్ అయి ఉండటం వల్ల గెలిచిన మహిళా కార్పొరేటర్లందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే అందులో ప్రధానంగా ఐదుగురు మహిళలు అనూహ్యంగా ముందు వరుసలో ఉన్నారు. వీరిలోనే ఒకరు మేయర్ అవుతారానేది ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి.
-
మంత్రి కేటీఆర్ మద్దతుపై అందరిలో నెలకొన్న ఉత్కంట..
డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి కేటీఆర్ ముందుగా పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో మేయర్ పీటం ఎవరికి దక్కుతుందనే దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. మంత్రి కేటీఆర్ ఎవరికి మద్దతు తెలుపుతారనేది అందరిలో ఆసక్తి నెలకొంది.
-
తెలంగాణ భవన్‌లో ప్రారంభమైన సమావేశం.. మొదటగా డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటం వద్ద నివాళులర్పించిన టీఆర్‌ఎస్ నేతలు..
గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కొత్తగా గెలిచిన కార్పొరేటర్లందరు హాజరయ్యారు. వారితో పాటుగా నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేతలందరూ ముందుగా ఆయనకు నివాళులర్పించారు.
Published On - Dec 06,2020 5:05 PM