ఇది మా అంతర్గత వ్యవహారం… చైనాకు ధీటుగా జవాబు!

ఆర్టికల్ 370 రద్దు… భారత ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించిన చైనా జమ్ముకశ్మీర్ అంశంపై ఏకపక్ష నిర్ణయాలకు భారత్‌ దూరంగా ఉండాలని, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతగా విడదీయడం అంగీకారయోగ్యం కాదని అసంతృప్తిని వ్యక్తం చేసిన కొద్దిసేపటికే భారత్ దీటుగా సమాధానమిచ్చింది. జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లులో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా విడదీసే ప్రతిపాదనపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేయగా..ఇది తమ అంతర్గత వ్యవహారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూటిగా బదులిచ్చింది. తాము ఇతర దేశాల అంతర్గత […]

ఇది మా అంతర్గత వ్యవహారం... చైనాకు ధీటుగా జవాబు!
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2019 | 9:15 PM

ఆర్టికల్ 370 రద్దు… భారత ప్రభుత్వ నిర్ణయాలపై స్పందించిన చైనా జమ్ముకశ్మీర్ అంశంపై ఏకపక్ష నిర్ణయాలకు భారత్‌ దూరంగా ఉండాలని, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతగా విడదీయడం అంగీకారయోగ్యం కాదని అసంతృప్తిని వ్యక్తం చేసిన కొద్దిసేపటికే భారత్ దీటుగా సమాధానమిచ్చింది. జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లులో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా విడదీసే ప్రతిపాదనపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేయగా..ఇది తమ అంతర్గత వ్యవహారమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూటిగా బదులిచ్చింది. తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టమని, ఇతర దేశాల నుంచి అదే కోరుకుంటామని స్పష్టం చేసింది. తన మిత్రదేశం పాకిస్థాన్‌ ప్రయోజనాలు, అలాగే చైనా-ఇండియా సరిహద్దులోని లద్దాఖ్‌లోని వివాదాస్పద అక్సాయ్‌చిన్‌ ప్రాంతం ఆ దేశం స్పందనకు కారణమయ్యాయి. భారత్ తనదిగా చెప్పుకుంటోన్న అక్సాయ్‌చిన్‌ ప్రాంతం ప్రస్తుతం చైనా నియంత్రణలోనే ఉంది.

‘చైనా భూభాగంలోకి భారత్ చొచ్చుకొని రావడాన్ని మా దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని ఆ దేశం ఓ ప్రకటన విడుదల చేసింది.  ‘కొద్ది రోజుల క్రితం చేసిన చట్టాల ద్వారా చైనా సార్వభౌమత్వాన్ని భారత్ తక్కువ చేయాలని చూస్తుంది. ఇది ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదు’ అని దానిలో పేర్కొంది. అలాగే సరిహద్దు వివాదాలను మరింత క్షిష్టతరం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ..‘ఆగస్టు 5న పార్లమెంటులో భారత ప్రభుత్వం పునర్విభజన బిల్లును ప్రవేశ పెట్టింది. దానిలో భాగంగా లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రతిపాదించడం భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారం’ అని స్పష్టం చేశారు.