చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన.. సైట్ దగ్గర హైటెన్షన్, సొమ్మసిల్లిపడ్డ మహిళలు
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కిష్ణరాంపల్లి చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తతలు సృష్టించింది. ప్రాజెక్టు కింద పోయిన భూమికి.. పూర్తి స్థాయి పరిహారం..

నల్గొండ జిల్లా చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తతలు సృష్టించింది. ప్రాజెక్టు కింద పోయిన భూమికి.. పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాలంటూ 300 మంది నిర్వాసితులు తమ కుటుంబాలతో ఆందోళనకు దిగారు. రిజర్వాయర్ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వీరిని ఆపడానికి ప్రయత్నించడంతో.. ప్రాజెక్టు సైట్ దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులకు.. నిర్వాసితులకు తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది మహిళలు సొమ్మసిల్లడంతో.. ఆస్పత్రికి తరలించారు.
