రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ గుడ్ బై తో ఎన్డీయే కూటమిలో మారిన బలాబలాలు, ఓ విశ్లేషణ, అయినా బీజేపీదే ఆధిక్యం
రైతు చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా రాష్ట్రీయ లోక్ తంత్ర్ పార్టీ (ఆర్ ఎల్ పీ) కూడా ఎన్డీయే నుంచి వైదొలగింది..

రైతు చట్టాలను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా రాష్ట్రీయ లోక్ తంత్ర్ పార్టీ (ఆర్ ఎల్ పీ) కూడా ఎన్డీయే నుంచి వైదొలగింది. ఈ పార్టీ నేత, రాజస్థాన్ లోని రాజౌరీ ఎంపీ హనుమాన్ బేనివాల్ నిన్న స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఇక లోక్ సభలో ఈ పార్టీకి ఉన్న ఒకే ఒక్క సీటు కూడా తగ్గడంతో ఎన్డీయే కూటమిలో సభ్యుల సంఖ్య తగ్గింది. అయితే మొత్తం మీద బీజేపీదే ఆధిక్యం అన్న విషయంలో సందేహం లేదు. తాజాగా ఈ పట్టిక లోక్ సభ, రాజ్యసభలో ఏ పార్టీకి ఎంతమంది సభ్యులున్నారో తెలుపుతోంది.
ఎన్డీఏ కూటమిలో తగ్గిన సభ్యుల సంఖ్య
ఎన్‌డీఏకు గుడ్ బై చెప్పిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఆఎల్పీకి లోక్ సభలో ఉన్న సీట్లు-01 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకమన్న ఆర్ఎల్పీ పార్లమెంటులో మారిన పార్టీల బలాబలాలు నేషనల్ డెమక్రటిక్ అలయన్ (ఎన్‌డీఏ)లోని పార్టీలు
పార్టీ పేరు లోక్ సభ రాజ్యసభ
1) బీజేపీ 302 93 2) ఎఐడీఎంకే- 01 09 3) జనతాదళ్ 16 05 4) ఆర్‌పీఐ(ఎ) 00 01 5) లోక్‌జనశక్తి 06 00 6) ఏజీపీ 00 01 7) అప్నాదళ్ 02 00 8) ఎన్‌పీపీ 01 01 9) పీఎంకే 00 01 10) టీఎంసీ 00 01 11) ఏజేఎస్‌యు 01 00 12) ఎన్‌డీపీపీ 01 00 13) ఎంఎన్‌ఎఫ్ 01 01 14) ఎస్‌కెమోర్చా 01 00 15) ఇండిపెండెంట్ 01 01 16) నామినేటెడ్ 00 04
మొత్తం 333 118
ఇదే సందర్భంలో డిసెంబరు నాటికి యూపీఏ విషయాన్ని కూడా పరిశీలిస్తే యూపీఏలో మొత్తం 12 పార్టీలు ఉండగా లోక్ సభలో ఈ కూటమికి 91 మంది, రాజ్యసభలో 57 మంది సభ్యులు ఉన్నారు. ఆ వివరాలను కూడా చూద్దాం.
యూపీఏలో మొత్తం పార్టీలు-12 కూటమికి లోక్ సభలో ఉన్నసభ్యుల సంఖ్య-91 మంది కూటమికి రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య-57 మంది యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్(యూపీఏ)లో సభ్యులు (డిసెంబర్, 2020)
పార్టీ పేరు లోక్ సభ రాజ్యసభ
1) కాంగ్రెస్ 51 37 2) డీఎంకే 24 07 3) ఎన్‌సీపీ 05 04 4) ఆర్జేడీ 05 00 5) ఐయుఎంఎల్ 03 01 6).జెకేఎన్‌సీ 00 03 7).జేఎంఎం 01 01 8) ఎండీఎంకే 00 01 9).ఆర్‌ఎస్‌పీ 01 00 1 0) వీసీకే 01 00 11) ఏఐయూడీఎఫ్ 01 00 12).ఇండిపెండెంట్ 0 1 01
మొత్తం 91 57