AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లమల అభయారణ్యాలు.. పెరుగుతున్న జంతు జీవరాశులు.. జీవ వైవిధ్యంపై కొనసాగుతున్న పరిశోధనలు..

Nallamala Forest History: దట్టమైన అభయారణ్యాలు.. అందులో ఎన్నో అరుదైన జంతురాశులు, ఇంకెన్నో క్రూర మృగాలు.. మరెన్నో జీవజాతులు..

నల్లమల అభయారణ్యాలు.. పెరుగుతున్న జంతు జీవరాశులు.. జీవ వైవిధ్యంపై కొనసాగుతున్న పరిశోధనలు..
Ravi Kiran
|

Updated on: Dec 27, 2020 | 2:44 PM

Share

Nallamala Forest History: దట్టమైన అభయారణ్యాలు.. అందులో ఎన్నో అరుదైన జంతురాశులు, ఇంకెన్నో క్రూర మృగాలు.. మరెన్నో జీవజాతులు.. చుట్టూ ఎత్తయిన చెట్లు.. కొండలు, లోయలు. ఇదీ నల్లమల అడవుల స్వరూపం. తెలుగు రాష్ట్రాల్లోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించిన ఈ నల్లమల ప్రాంతం కృష్ణా, పెన్నా నదుల మధ్య ఉంది. సుమారు 9,500 కి.మీ విస్తీరణలో ఈ అటవీ ప్రాంతం ఉండగా.. అందులో దట్టమైన అటవీ ప్రాంతం పరిధి 3,000 కిలో మీటర్లు. అలాగే ఉత్తర-దక్షిణ దిశగా 150 కి.మీ వరకు విస్తరించిన నల్లమల మధ్యభాగం పులులకు అభ్యయారణ్యంగా పిలుస్తుంటారు.

మరోవైపు నల్లమల అభయారణ్యంలో జీవ వైవిధ్యంపై శాస్త్రవేత్తల పరిశోధనలు జరుపుతున్నారు. సున్నిపెంటలోని బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ పరిశోధనలు సాగుతున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న పులుల సంతతిపై శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే అరుదైన కొత్త జీవులను సైతం గుర్తించే పనిలో పడ్డారు. అటు నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు వేలాది జీవరాశులకు నిలయంగా మారాయి.

గత పదేళ్లుగా నల్లమలలో వన్యప్రాణుల సంతతి పెరుగుతూ వస్తోంది. దట్టమైన అడవులు కూడా విస్తరిస్తున్నాయి. నల్లమలలో ఉన్న జీవజాతులు మరో చోట కనిపించడం అరుదు. ఈ దట్టమైన అడవుల్లో వివిధ రకాల జింకలు ఉన్నాయి. జింకల్లో అతి చిన్నది మూషిక జింక కాగా.. పెద్దది జింక కణితి.. దీనినే సాంబార్ డీర్‌గా పిలుస్తారు. శ్రీలంకన్ ఫ్లైయింగ్ స్నేక్, అరుదైన గద్దెను సైతం శాస్త్రవేత్తలు నల్లమల అభయారణ్యంలో కనుగొన్నారు.

నల్లమలలో కనుక్కున్న అరుదైన రకాలు ఇలా ఉన్నాయి…

మెటోక్రొమాస్‌టిస్‌ నైగ్రోఫి యొరేటో, మారస్‌ శ్రీశైల యెన్సిస్‌(సాలీడు), నాగార్జునసాగర్‌ రేజర్‌(పాము), స్లెండర్‌ కోరల్‌ స్నేక్‌ (పాము), ఫ్రీనికస్‌ ఆంధ్రాయెన్సిస్‌(సాలీడు), పోయిసిలోథీరియా నల్లమలైయెన్సిస్‌(సాలీడు), సిరాప్టిరస్‌ లాటిప్స్‌(కీటకాలు), డారిస్తీన్స్‌ రోస్ట్రాటస్‌(గొల్లభామ), శ్రీలంకన్‌ ఫ్లైయింగ్‌ స్నేక్, స్యాండ్‌ స్నేక్, టు స్పాటెడ్‌బార్బ్‌ అనే అరుదైన చేప, నీటి పిల్లులు, కొండ గొర్రెలు

నల్లమలలో ఉన్న జీవజాతులు వివరాలు ఇవే..

నల్లమలలో ఉన్న క్షీరదాల జాతులు-55

పక్షుల రకాలు-200

ఉభయచరాల రకాలు-18

సరీసృపాల రకాలు-54

చేపల జాతులు-55

వివిధ జాతుల కీటకాలు-లక్షకు పైగానే

నల్లమలలో పులులు- 80కి పైనే