బిగ్ బాస్ రౌండ్అప్ 2020 : కరోనా సమయంలోనూ దైర్యం చేసి బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ చేసిన కింగ్..

ఇతర భాషల్లో అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. సీజన్ 1 నుంచి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.

బిగ్ బాస్ రౌండ్అప్ 2020 : కరోనా సమయంలోనూ దైర్యం చేసి బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ చేసిన కింగ్..
Rajeev Rayala

| Edited By: Pardhasaradhi Peri

Dec 27, 2020 | 3:55 PM

ఇతర భాషల్లో అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. సీజన్ 1 నుంచి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. ఆతర్వాత యంగ్ హీరో నాని బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ గా మారి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత సీజన్ 3 కి కింగ్ నాగార్జున తనదైన హోస్టింగ్ తో అలరించారు. ఇక ఈ ఏడాది  కూడా బిగ్ బాస్ సీజన్ 4 ను మన్మధుడే నడిపించాడు. ఈ ఏడాది కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా అసలు బిగ్ బాస్ ఉంటుందా అని అంతా అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలోనే కింగ్ నాగార్జున దైర్యం చేసిన బిగ్ బాస్ సీజన్ 4 ను మొదలు పెట్టారు.

సెప్టెంబర్ 4న బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది. డిసెంబర్ 20 తో ఈ షో ముగిసింది. 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కరోనా సమయంలో షూటింగ్ మొదలు పెట్టిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున మాత్రమే అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లోకి వచ్చిన ఇంటిసభ్యులు ఎక్కువ మంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివరే .. యంగ్ హీరో అభిజీత్, మోనాల్ గజ్జర్, సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, అమ్మరాజశేఖర్, లాస్య, మెహబూబ్ దిల్ సే, సోహెల్ , సుజాత, దేత్తడి హారిక, దేవీనాగవల్లి, అరియనా గ్లోరి, దివి, నోయల్, అఖిల్, గంగవ్వ. ఇలా పదహారుమంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో దర్శకుడు సూర్యకిరణ్ మొదటివారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు.  ఆతర్వాత కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.

ఆతర్వాత దేవి నాగవల్లి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆతర్వాత వైల్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ స్వాతి దీక్షిత్ కూడా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేదు ఆమె హౌస్ లోకి వెళ్లిన వారమే ఎలిమినేట్ అయ్యాయి బయటకు వచ్చేసింది. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి స్పెషల్ హౌస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ తన మాటలతో హౌస్ లో ఉన్నవారిని, ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే  హౌస్ లో 34 రోజులు ఉన్న గంగవ్వ అనారోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆవెంటనే సుజాత బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ఎలిమినేట్ అయ్యింది. అదే సమయంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కుమార్ సాయి. తనదైన ఆటతో ప్రేక్షకులను అలరించిన కుమార్ సాయి అనూహ్యంగా ఓట్లు తక్కువ రావడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆతర్వాత దివి  హౌస్ లో 49 తొమ్మిది రోజులు ఉండి ఎలిమినేట్ అయ్యింది. దివి తర్వాత నోయల్ అనారోగ్య సమస్యల కారణంగా బయటకు వచేసాడు. 53 రోజుల పాటు హౌస్ లో ఉండి ప్రేక్షకులను అలరించాడు నోయల్. ఇక అమ్మరాజశేఖర్ 63వరోజు , మెహబూబ్ 70 వరోజు ఎలిమినేట్ అయ్యారు.

మొదట్లో అంతగా ఆసక్తిగా సాగని బిగ్ బాస్ మెల్లమెల్లగా ఊపందుకుంది. హౌస్ లో ఎవరు ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. అదేసమయంలో 77వ రోజు లాస్య హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆతర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక చివరగా మోనాల్ గజ్జర్ హౌస్ లో 98 రోజులు ఉండి ఎలిమినేట్ అయ్యాయంది. దాంతో హారిక సోహెల్, అఖిల్, అభిజీత్ , అరియనాలు టాప్ 5 కు చేరుకున్నారు. వీరిలో హారిక అరియనా ఎలిమినేట్ అవ్వగా సోహెల్ మూడో స్థానంలో 25 లక్షలతో బయటకు వచేసాడు. ఆతర్వాత అఖిల్ రన్నరప్ గా నిలవగా అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అయ్యాడు. మొదటినుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ వస్తున్న అభిజీత్ కు ప్రేక్షకులు భారీగా ఓట్లు వేసి గెలిపించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu