వరల్డ్ రెజ్లింగ్ సూపర్ స్టార్ కన్నుమూత..ల్యూక్‌హార్పర్ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంతాపం
కోవిడ్ సమయంలో రెజ్లింగ్ ఆటగాడు క్రీడాకారులు కన్నుమూశాడు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ స్టార్ జాన్ హుబెర్ ఈ ఉదయం మృతి చెందాడు. ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ల్యూక్‌హార్పర్ మృతి విషయాన్ని..

కోవిడ్ సమయంలో రెజ్లింగ్ ఆటగాడు క్రీడాకారులు కన్నుమూశాడు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ స్టార్ జాన్ హుబెర్ ఈ ఉదయం మృతి చెందాడు. ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ల్యూక్‌హార్పర్ మృతి విషయాన్ని వెల్లడించారు. ఊపరితిత్తుల సమస్యతో హార్పర్ మరణించినట్లుగా తెలిపారు. హార్పర్ కరోనా నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. హార్పర్ 2019 చివర్లో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)ను నుంచి ఆల్ ఎలైట్ రెజ్లింగ్‌లో చేరారు. ఆయన మృతి పట్ల క్రీడాలోకం సంతాపం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ల్యూక్‌హార్పర్‌కు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. వయసుతో సంబంధం లేకుండా హార్పర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ మ్యాన్ ఇక లేడు అని తెలిసిన ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సోషల్ మీడియాలో సాడ్ పోస్టింగ్స్ పెడుతున్నారు.
ల్యూక్‌హార్పర్ మరణం విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్ చేసింది. ర్యాండీ ఓర్టన్, షేమస్, ట్రిపుల్ హెచ్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్లు హార్పర్ మృతికి ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.
WWE is saddened to learn that Jon Huber, known to WWE fans as Luke Harper, passed away today at age 41. WWE extends its condolences to Huber’s family, friends and fans.https://t.co/hZnBguE4Mj
— WWE (@WWE) December 27, 2020
ఆల్ ఎలైట్ రెజ్లింగ్‌లో బ్రాడ్ లీగా గుర్తింపు పొందిన జోనాథన్‌కు ఓవరాల్‌గా 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉంది. అభిమానులంతా అతన్నిప్రేమగా బిగ్ మ్యాన్‌గా పిలుచుకునేవారు. 6 అడుగుల 5 అంగుల పొడవు, 275 పౌండ్ల బరువుతో ఆజానుబాహుడిగా కనిపించేవాడు. గుబురు గడ్డం, మీసంతో కనిపించే హర్పర్.. ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ను రెండు సార్లు గెలుచుకున్నాడు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.
1979లో న్యూయార్క్‌లో జన్మించిన హ్యూబర్ రెజ్లర్‌గా 1990లో తన కెరీర్ ప్రారంభించారు. 2003లో రోచెస్టర్ ప్రోరెజ్లింగ్‌లో బ్రోడై లీ పేరుతో రింగ్‌లోకి దిగారు. 1995లో కెవిన్ స్మిత్ సినిమా మాల్‌రాట్స్‌లో ఓ పాత్ర పోషించారు. 2012లో డబ్ల్యూడబ్ల్యూఈతో ఒప్పందం చేసుకొని ల్యూక్‌హార్పర్‌గా పేరుమార్చుకొని బరిలోకి దిగారు. 2019 చివరి వరకు కొనసాగారు.