Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాండ్‌లైన్ నెంబర్‌తోనూ ‘వాట్సాప్’ అకౌంట్.. ఇంకా తెలియని ఎన్నో ట్రిక్స్ .. మీరూ లుక్కేయండి.!

Whatsapp New Features: భారతదేశంలో మోస్ట్ పాపులర్ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనిని వాడుతున్న యూజర్లు ఎందరో ఉన్నారు.

ల్యాండ్‌లైన్ నెంబర్‌తోనూ 'వాట్సాప్' అకౌంట్.. ఇంకా తెలియని ఎన్నో ట్రిక్స్ .. మీరూ లుక్కేయండి.!
Follow us
Ravi Kiran

| Edited By: Rajeev Rayala

Updated on: Dec 27, 2020 | 3:44 PM

Whatsapp New Features: భారతదేశంలో మోస్ట్ పాపులర్ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనిని వాడుతున్న యూజర్లు ఎందరో ఉన్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ ఇలా బోలెడన్ని గ్రూపులు మైంటైన్ చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతున్న డైలీ రొటీన్ పనులన్నీ కూడా యూజర్లు ఈ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఎప్పటికప్పుడు వినూత్న ఫీచర్స్‌ను అందిస్తూ వాట్సాప్ ఆకట్టుకుంటోంది. ఐకాన్స్‌, మ్యూట్‌ బటన్‌, కేటలాగ్‌ షార్ట్‌కట్‌, గంపెడన్నీ ఎమోజీలు.. ఇలా ఎన్నో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను మీరు చూసే ఉండొచ్చు. అయితే ఇప్పటిదాకా వాట్సాప్ అందించే కొన్ని రహస్య ట్రిక్స్ గురించి మాత్రం ఎవరికి తెలిసి ఉండదు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ ఆడియో ఫైల్స్‌ను వాకీ-టాకీగా ఉపయోగించుకోవచ్చు… 

మనకి వచ్చే వాట్సాప్ ఆడియో ఫైల్స్‌ను వాకీ-టాకీగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా మీకు వాట్సాప్ ఆడియో ఫైల్ వచ్చినప్పుడు.. దానిని ఇయర్ ఫోన్స్‌తో కాకుండా మీ చెవి దగ్గర పెట్టి వినండి. అది స్పీకర్ల ద్వారా కాకుండా మీ స్మార్ట్‌ఫోన్ ఇయర్‌పీస్ నుంచి వచ్చినట్లు వినిపిస్తుంది. ఈ క్రమంలోనే వాట్సాప్ ఆడియో ఫైల్స్‌ను మీరు సరదాగా ‘వాకీ టాకీ’గా ఉపయోగించుకోవచ్చు. అవతల వ్యక్తికి టైప్ చేసి మెసేజ్ పంపడం, కాల్ చేయడం బదులు.. ఇలాంటి చిన్న వాయిస్ క్లిప్స్ ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు.

వర్చువల్ నెంబర్స్ ద్వారా వాట్సాప్‌లో లాగిన్ కావొచ్చు… 

రెగ్యులర్ నెంబర్ నుంచి కాకుండా వర్చువల్ నెంబర్ నుంచి మీరు వాట్సాప్ లాగిన్ కావచ్చు. దాని కోసం ‘టెక్స్ట్ నౌ’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ ఫోన్‌లో ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. అందులో ఫ్రీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ అయితే.. మీకు యూఎస్, కెనడా బేస్డ్ ఐదు ఫ్రీ మొబైల్ నెంబర్స్ జాబితా వస్తుంది. అందులో మీకు నచ్చిన సంఖ్యను ఎంచుకుని.. వర్చువల్ నెంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాను సృష్టించవచ్చు.

ల్యాండ్ లైన్ నెంబర్ ద్వారా వాట్సాప్ అకౌంట్….

మాములు మొబైల్ నెంబర్ ద్వారా వాట్సాప్ యాప్ నుంచి లాగిన్ కావచ్చు. అయితే మీకు తెలియని ఇంకో విషయం. ల్యాండ్ లైన్ నెంబర్ ద్వారా వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడం. దాని కోసం ముందుగా వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్ లోడ్ అయిన అనంతరం ఓటీపీ కోసం ఫోన్ నెంబర్‌ను అడుగుతుంది. ఇండియా కోడ్ (+91) ను ఎంచుకోండి, తరువాత మీ ఎస్టీడీ కోడ్‌లో ‘0’ తీసేసి.. ల్యాండ్‌లైన్ నంబర్‌ను టైప్ చేయండి. దీనితో మీకు ఓటీపీ వస్తుంది. అది ల్యాండ్ లైన్ కాబట్టి మెసేజ్ రాదు.  ఓటీపీ నమోదు చేసే టైం ముగిసేవరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత కాల్ ద్వారా OTP కన్ఫర్మ్ చేసుకోండి.

యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదవొచ్చు… 

మీకు మెసేజ్ వచ్చినట్లు నోటిఫికేషన్‌లు వస్తే.. వాటిని స్వైప్ చేయకండి. కేవలం మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేసి యాప్ తెరవకుండానే పూర్తి మెసేజ్‌ను చదవొచ్చు.

బ్లాక్ చేసిన వాళ్లకు మెసేజ్ పంపితే కేవలం ఒక టిక్ మార్క్ వస్తుంది… 

మిమ్మల్ని బ్లాక్ చేసినవాళ్లకు.. మీరు ఏవైనా మెసేజ్‌లు పంపినప్పుడు.. వాటికి ఎల్లప్పుడూ ఒక టిక్ మార్క్ వస్తుంది. డబుల్ టిక్ మాత్రం రాదు.

వాట్సాప్ వెబ్ ద్వారా మీ అకౌంట్ దుర్వినియోగం అయ్యే అవకాశం… 

వాట్సాప్ వెబ్ ద్వారా మీ అకౌంట్‌ను మీకు తెలియకుండానే వేరే వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు. అందుకే ఎల్లప్పుడూ మీ సెట్టింగ్స్‌ను పర్యవేక్షిస్తూ ఉండండి.