కాందహార్ విమానం హైజాక్ ఉదంతానికి 21 ఏళ్ళు.. ఎనిమిది రోజుల పాటు సాగిన ఉత్కంఠ.. చివరికి ఏం జరిగిందంటే..
సరిగ్గా 21 ఏళ్ళు కిందట 1999లో కాందహార్ విమానం హైజాక్ గురయ్యింది. విమానం హైజాక్ అవ్వడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాయంత్రం 5 గంటలకు భారత గగనతంలోకి విమానం..

సరిగ్గా 21 ఏళ్ళు కిందట 1999లో కాందహార్ విమానం హైజాక్ గురయ్యింది. విమానం హైజాక్ అవ్వడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాయంత్రం 5 గంటలకు భారత గగనతంలోకి విమానం ప్రవేశించగానే అందులోని హైజాకర్లు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్ సర్, లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు. జైల్లో ఉన్న తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని, 200 మిలియన్ డాలర్లు (రూ. 1400 కోట్లు) ఇవ్వాలని భారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎనిమిది రోజుల పాటు ఈ ఉత్కంఠ కొనసాగింది. హైజాక్ కు గురైన సీ814 విమానంలో 176 మంది ప్రయాణికులు, మరో 15 మంది సిబ్బంది ఉన్నారు. భారత గగనతలంలోకి రాగానే కాక్‌పిట్ వైపు వచ్చిన ముసుగు ధరించిన మిలిటెంట్లు విమానాన్ని లాహోర్‌కు తీసుకువెళ్లాలని ఆదేశించారు. లేదంటే బాంబుతో విమానాన్ని పేల్చేస్తానని పైలట్ ను బెదిరించారు. అదే సమయంలో సీట్లలో నుంచి లేచి, విమానంలోని నాలుగు వేర్వేరు చోట్ల నిల్చున్న మిలిటెంట్లు ప్రవేశించారు. విమానాన్నిలాహోర్ వైపు మళ్లించాలని కెప్టెన్ దేవీ శరన్ కు మిలిటెంట్లు ఆదేశించారు. అయితే విమానంలో తక్కువ ఇంధనం ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని అమృత్‌సర్‌లో దించారు కెప్టెన్.
విమానం ల్యాండ్ అవ్వగానే హైజాకర్లపై చర్యకు భద్రత దళాలు సిద్ధమయ్యాయి. వెంటనే పసిగట్టిన హైజాకర్లు ఇంధనం నింపకుండానే విమానాన్ని లాహోర్ తీసుకువెళ్లేలా పైలట్ పై ఒత్తిడి తెచ్చారు. దాంతో చేసేదేమి లేక లాహూర్ కు తీసుకువెళ్లారు. అయితే లాహూర్ విమానాశ్రయ అధికారులతో మంతనాలు చేసారు అయితే వారు ఇంధనం నింపుకొని వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు దాంతో లాహోర్ విమానాశ్రయంలో లైట్లు కూడా ఆఫ్ చేయించారు హైజాకర్లు. ఇంధనం నింపుకునేందుకు లాహోర్ విమానాశ్రయంలో విమానంఆగింది. ఇంధనం నింపుకున్న వెంటనే లాహోర్ నుంచి వెళ్లిపోవాలని పాకిస్తాన్ ఆదేశించింది. ఆ తర్వాత అక్కడినుంచి దుబాయి విమానాశ్రయానికి విమానం పయనమైంది. 27 మంది ప్రయాణికులను అక్కడ విడుదల చేసారు హైజాకర్లు. అదేసమయంలో దుబాయి విమానాశ్రయంలో హైజాకర్లపై చర్యలు తీసుకోవాలని యూఏఈని భారత్ కోరింది అందుకు యూఏఈ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ తర్వాత అక్కడినుంచి ఆఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు చేసుకుంది విమానం హైజాక్ ఉదంతం ముగిసేవరకూ విమానం అక్కడే ఉంది.
విపరీతమైన చలిలో వారం పాటు విమానాశ్రయంలోనే ప్రయాణీకులు ఉన్నారు. ఖాళీ మైదానంలో మంట వేసుకుని, చలి కాచుకుంటూ ఉన్నారు తాలిబన్లు విమానంలో ఉన్నవారి కోసం ఆహార పానీయాలు ఏర్పాటుచేశారు తాలిబన్లు. అయితే హైజాకర్లు పైన యాక్షన్ తీసుకునేందుకు భారత్ కమాండో సిద్ధమైంది. అందుకు అఫ్గానిస్తాన్ ను భారత్ అనుమతికోరింది. కానీ విదేశీ సైన్యం తమ భూభాగంలోకి వద్దని అఫ్గానిస్తాన్ వెల్లడించింది. ఆతర్వాత తాలిబన్లతో భారత్ చర్చలు జరిపింది. తమ బందీలుగా వారిని విడుదల చేయాలన్న కోరారు తాలిబన్లు. హైజాకర్ల డిమాండ్లకు అంగీకరించిన భారత్ మిలిటెంట్ల విడుదలకు అంగీకారం తెలిపింది. హైజాక్ ముగిసే వరకు కాందహార్ విమానాశ్రయంలోనే ఉన్నారు భారత, ఆప్ఘన్ అధికారులు. రెండుసార్లు కాందహార్ వచ్చిన అప్పటి భారత విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ హైజాకర్లతో సంప్రదింపుల జరిపారు. మిలిటెంట్లు మౌలానా మసూద్ అజహర్, ముశ్తాక్ జర్గర్, అహ్మద్ ఉమర్ సయీద్ శేఖ్‌లను విడుదల చేసి భారత్‌లోని జైళ్ల నుంచి కాందహార్ విమానాశ్రయానికి తీసుకు వచ్చి అప్పగించారు అధికారులు. హైజాక్ ఉదంతం ముగిసే సమయంలో విమానం వద్దకి అంబులెన్స్ వచ్చి ఆగింది. ముసుగుల్లో ఉన్న ఐదుగురు హైజాకర్లు,మసూద్ అజహర్ సహా విడుదలైన మిలిటెంట్లు ఆ ఆంబులెన్స్ లో పారిపోయారు. వెళ్తూ వెళ్తూ.. రెండు గంటల్లోపు అఫ్గానిస్తాన్ దాటి వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో మరో విమానం ఎక్కిన ప్రయాణీకులు క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ ఉదంతం జరిగి సరిగ్గా 21 ఏళ్ళు అవుతుంది.




