‘చంద్రయాన్-3’ షురూ!..ఈ సారి పక్కా ప్రణాళిక
చంద్రయాన్-2 ప్రయోగంతో ఇటీవల భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే అది జస్ట్ మిస్ అవ్వడంతో ఈ సారి మరింత కసిగా చంద్రయాన్-3 తో ముందడుగు వెయ్యాలని ఇస్రో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇందుకోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విసృత స్థాయి చర్చలు జరిపింది. చంద్రయాన్-3కి సంబంధించి అన్ని రకాల వ్యూహాలను.. ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పిస్తుంది. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ సోమనాథ్ ఈ కమిటీకి హెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి […]
చంద్రయాన్-2 ప్రయోగంతో ఇటీవల భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే అది జస్ట్ మిస్ అవ్వడంతో ఈ సారి మరింత కసిగా చంద్రయాన్-3 తో ముందడుగు వెయ్యాలని ఇస్రో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఇందుకోసం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విసృత స్థాయి చర్చలు జరిపింది. చంద్రయాన్-3కి సంబంధించి అన్ని రకాల వ్యూహాలను.. ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పిస్తుంది.
తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ సోమనాథ్ ఈ కమిటీకి హెడ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సారి సాప్ట్ ల్యాండింగ్ లక్ష్యంగా కమిటీ పూర్తి లక్ష్యాలను నిర్దేశించుకుంది. చంద్రయాన్-3 ప్రయోగానికి నవంబర్ 2020 ని డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఇస్రో తాజా అడుగులతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.