AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం: తాగే ద్రావకం అనుకోని..పురుగుల మందు తాగి..

విధి..మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటన ప్రత్యక్ష ఉదాహారణ. పురుగుల మందు డబ్బాను తాగే ద్రావకం భావించిన ఇద్దరు చిన్నారులు.. దాన్ని సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పిట్టలగూడెంలో జరిగింది. అప్పటివరకు ఆ చిన్నారులు బడిలో చదువుకోని వచ్చారు. సాయంకాలం సమయం కావడంతో..ఆటవిడుపు కోసం బయటకి వెళ్లారు. కానీ అదే వాళ్ల ప్రాణాలను హరిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆటల మధ్యలో ఓ చెట్టు […]

దారుణం: తాగే ద్రావకం అనుకోని..పురుగుల మందు తాగి..
Ram Naramaneni
|

Updated on: Nov 15, 2019 | 3:23 PM

Share

విధి..మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటన ప్రత్యక్ష ఉదాహారణ. పురుగుల మందు డబ్బాను తాగే ద్రావకం భావించిన ఇద్దరు చిన్నారులు.. దాన్ని సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పిట్టలగూడెంలో జరిగింది.

అప్పటివరకు ఆ చిన్నారులు బడిలో చదువుకోని వచ్చారు. సాయంకాలం సమయం కావడంతో..ఆటవిడుపు కోసం బయటకి వెళ్లారు. కానీ అదే వాళ్ల ప్రాణాలను హరిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆటల మధ్యలో ఓ చెట్టు పక్కనే ఉన్న డబ్బాపై చిన్నారుల దృష్టి పడింది. దాన్ని తాగే ద్రావకంగా భావించిన వారు వెంటనే ఇంటికి తీసుకువచ్చి..గ్లాసుల్లో పోసుకుని తాగేశారు. పెద్దలెవరూ గమనించికపోవడంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే నొట్లో నురగలతో..అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇద్దరు చిన్నారులను చేర్యాల గవర్నమెంట్ హాప్పటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తుండగా ఒకరు..మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట హాస్పటల్‌కి తరలిస్తుండగా మరొకరు తనువు చాలించారు. ఊహించని ఈ పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చనిపోయిన చిన్నారులను తుమ్మల రమేశ్‌ కుమారుడు భాస్కర్‌ (13), కాలియ లక్ష్మణ్‌ కుమారుడు బన్నీ (11) లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు.

Follow Us
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..